కొత్త డ్యాన్స్‌ను పరిచయం చేస్తున్న రామ్

Updated By ManamMon, 10/15/2018 - 10:48
Ram Pothineni

Ram Pothineniడ్యాన్స్‌లలో బాలీవుడ్‌ హీరోలను ఢీకొట్టే ఎంతోమంది హీరోలు మన టాలీవుడ్ సొంతం. సీనియర్ హీరోలలో చిరంజీవిని మొదలుకొని యంగ్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రామ్, సుధీర్ బాబు, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలా మంది హీరోలు తమ డ్యాన్స్‌లతో అందరినీ ఆకట్టుకుంటుంటారు. అంతేకాదు వీరిలో పలువురు డ్యాన్స్‌లలో కొత్త కొత్త స్టైల్‌లను టాలీవుడ్‌కు పరిచయం చేశారు(రీసెంట్‌గా నా పేరు సూర్యలో అల్లు అర్జున్ క్యాప్ డ్యాన్స్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే). కాగా తాజాగా యంగ్ హీరో రామ్ మరో కొత్త డ్యాన్సింగ్ స్టైల్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాడు.

త్రినాథరావు దర్శకత్వంలో రామ్ హలో గురు ప్రేమ కోసమే అనే చిత్రంలో నటించగా.. అందులో పెద్ద పెద్ద కళ్లతోటి అనే పాట కోసం పాపింగ్ అనే కొత్త స్టైల్‌ను పరిచయం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. విజయ్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాటలో పాపింగ్ స్టైల్‌ను దక్షిణాదికి పరిచయం చేయబోతున్నట్లు రామ్ తెలిపారు. కాగా ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, ప్రణీత నటించారు.

 

English Title
Ram introduced new style dance in Hello Guru Prema Kosame
Related News