చాలా నిరాశగా ఉంది: రామ్ చరణ్

Ram Charan

బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రస్తుతం ‘వినయ విధేయ రామ’లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కోసం ప్రస్తుతం వెళ్లిన రామ్ చరణ్.. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకోలేకపోయాడు. దీంతో చాలా నిరాశగా ఉందని సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తపరిచాడు చెర్రీ.

కొన్ని కారణాల వలన ఓటును వేయనందుకు చాలా నిరాశగా ఉంది. అందరూ ఓటు వేయండి.. మీ ఓటుకు కౌంట్‌ ఉంటుంది అంటూ చెర్రీ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. కాగా వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు