‘2.O’ అలా ప్రారంభమవుతుందట

Updated By ManamFri, 11/09/2018 - 14:53
2.O

2.Oకోలీవుడ్‌లోనే కాకుండా ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో ఎంతోమంది సినీ ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం 2.O. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించాడు. అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. కాగా ఈ చిత్ర ప్రారంభం గురించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.

అదేంటంటే అక్షయ్ కుమార్ చనిపోవడంతో ఈ చిత్రం ప్రారంభం అవుతుందట. అదేపనిగా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం వలన రేడియేషన్ కారణంగా అక్షయ్ చనిపోతాడట. ఆ తరువాత ఓ దుష్టశక్తిగా మారిన అక్షయ్, స్మార్ట్ ఫోన్లు వాడే వారిని టార్గెట్ చేస్తూ వెళతాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఈ నెల 29వరకు ఆగాల్సిందే.

English Title
Rajinikanth's 2.O starts from Akshay Kumar's death..?




Related News