రజనీకాంత్ సీరియస్

Updated By ManamFri, 11/09/2018 - 23:39
Rajinikanth
  • సర్కార్ సినిమాకు సూపర్‌స్టార్ మద్దతు

Rajinikanthచెన్నై: విజయ్ నటించిన సర్కార్ సినిమాలో కొన్ని సన్నివేశాల విషయంలో అన్నాడీఎంకే నిరసన వ్యక్తం చేయడాన్ని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఖండించారు. సెన్సార్ బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చిన తర్వాతే అది విడుదల అవుతుందని, ఆ తర్వాత కూడా వీళ్లు ఇలా చేయడం సరికాదని.. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని రజనీ అన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన సినిమాలోని కొన్ని సీన్లను తొలగించాలని డిమాండు చేయడం చట్టవిరుద్ధమని, బ్యానర్లు చించేయడం.. ప్రదర్శనలను అడ్డుకోవడం తగని పని అని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారాలను తాను గట్టిగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అయితే, దివంగత ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి చేసినట్లున్న వ్యాఖ్యలను మ్యూట్ చేస్తామని, అలాగే అభ్యంతరకరంగా ఉన్న కొన్ని దృశ్యాలను తొలగిస్తామని సర్కార్ దర్శక నిర్మాతలు తెలిపారు.జయలలిత మీద, ఆమె ప్రవేశపెట్టిన కొన్ని పథకాల మీద సినిమాలో వ్యాఖ్యలు ఉండటంతో పాలక అ న్నాడీఎంకే తీవ్రంగా మండిపడుతోంది. అభ్యంత రకరంగా ఉన్న దృశ్యాలను వెంటనే తొలగించాలని, లేకపోతే సినిమా సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా  మంత్రులు బెదిరించారు. కొన్ని దృశ్యాలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, అందువల్ల చర్యలు తప్పవని న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎడిట్ చేసిన సినిమానే ప్రదర్శిస్తామని థియేటర్ల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ  సినిమా ఈ నెల ఆరోతేదీన విడుదలైంది. కాగా,  తనను అరెస్టు చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్ శుక్రవారం మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

English Title
Rajinikanth Serious
Related News