ఫేస్‌బుక్‌లో ‘కాలా’ ప్రీమియర్ షో లీక్!

Updated By ManamThu, 06/07/2018 - 09:09
Rajinikanth new movie, kaala premiere show, leaked in facebook, Singapore

Rajinikanth new movie, kaala premiere show, leaked in facebook, Singaporeతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కాలా’ ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదల అవుతోంది. ‘కాలా’ సినిమా కోసం రజిని అభిమానులు మాత్రమే కాదు సగటు సినిమా అభిమాని కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణమిది. అయితే, విడుదలకు ముందే ‘కాలా’ చిత్ర యూనిట్‌కు పెద్ద షాక్ తగిలింది. సింగపూర్‌లో ‘కాలా’ సినిమా ప్రీమియర్ షో లీక్ అయింది. ఫేస్‌బుక్‌లో కాలా సినిమాను లైవ్ టెలికాస్ట్ చేశారు. దాదాపు 45 నిమిషాల సినిమాను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. భారత్‌ కంటే ముందుగానే సింగపూర్‌లో ‘కాలా’ సినిమా ప్రివ్యూలు విడుదల చేశారు. సింగపూర్‌లో ఓ థియేటర్ నుంచి ప్రవీణ్ దేవర్ అనే ఓ వ్యక్తి కాలా సినిమాను తన మొబైల్ నుంచి దాదాపు 45 నిమిషాల పాటు ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టాడు. రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో 45 నిమిషాలు లీక్ కావడంతో రజిని అభిమానులు షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు దేవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కర్ణాటకలో ‘కాలా’ టెన్షన్.. భారీ బందోబస్తు..
మరోవైపు కర్ణాటకలో ‘కాలా’ సినిమా విడుదలకు సంబంధించి టెన్షన్ వాతావారణం నెలకొంది. కావేరి జలవివాదంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోనలు వెల్లువెత్తిన నేపథ్యంలో కర్ణాటకలో రజనీకాంత్ కాలా సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని ఆందోళనకారులు పిలుపునిచ్చారు. దాంతో కాలా సినిమా విడుదలయ్యే థియేటర్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, రజనీ అల్లుడు ధనుష్ ‘కాలా’ చిత్రాన్ని నిర్మించగా, పా రంజిత్ దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నానా పటేకర్, సముద్రఖని, హుమా ఖురేషి, ఈశ్వరి రావులు తదితరులు నటించారు.

English Title
Rajinikanth new movie kaala premiere show leaked in facebook at Singapore
Related News