‘సర్కార్‌’కు రజనీ, కమల్ మద్దతు

Updated By ManamFri, 11/09/2018 - 11:44
Sarkar

Sarkarవిజయ్ హీరోగా మురగదాస్ తెరకెక్కించిన సర్కార్‌ ఓ వైపు థియేటర్లలో దూసుకుపోతుండగా.. మరోవైపు వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో జయలలితను, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్‌లు సర్కార్‌కు తమ మద్దతును ప్రకటించారు. 

‘‘సెన్సార్ బోర్డు సినిమా ప్రదర్శనకు అనుమతిచ్చాక పలు సినిమాలను తొలగించాలని డిమాండ్ చేయడం, పోస్టర్లను చించుతూ ఆందోళన చేయడం సబబు కాదు. ఇవన్నీ అననైతిక చర్యలు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని రజనీ ట్వీట్ చేశారు. అలాగే కమల్ స్పందిస్తూ.. ‘‘సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకున్న సర్కార్‌ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం ప్రస్తుత ప్రభుత్వానికి కొత్తేం కాదు. విమర్శలను నేరుగా ఎదుర్కోలేక ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది. కమర్షియల్ రాజకీయ నాయకులు ఎప్పటికైనా కనుమరుగైపోవాల్సిందే’’ అని ట్వీట్ చేశారు.

English Title
Rajinikanth, Kamal Haasan supports Sarkar
Related News