పెళ్లిళ్లు అవ్వడం లేదని ఊరి పేరునే మార్చేశారు

Updated By ManamFri, 08/10/2018 - 12:52
mahesh nagar

mahesh nagarజైపూర్: రాజస్థాన్‌లో వింత జరిగింది. ఊర్లో అన్ని సౌకర్యాలు ఉన్నా, యువకులు మంచి ఉద్యోగాలు చేస్తున్నా చుట్టుపక్కల గ్రామాల నుంచి అమ్మాయిల్ని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకురావడం లేదని, తమ ఊరి పేరేనే మార్చేశారు స్థానికులు. ఆ ఊరికి గతంలో ఉండే పేరునే మరోసారి పెట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోరి బర్మర్ జిల్లాలో మియాంకా బరా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే ముస్లిం ఊరిపేరు కావడంతో ఈ ఊరికి ఆడ పిల్లలను ఇచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో తమ గ్రామం పేరును మార్చాల్సిందిగా అధికారులకు పలుమార్లు విఙ్ఞప్తి చేశారు. దీనికి కేంద్రం నుంచి ఆమోదం రావడంతో తాజాగా ఊరిపేరును మార్చారు. ప్రస్తుతం ఈ ఊరికి మహేశ్ నగర్‌గా పేరు పెట్టారు. ఇక ఈ విషయంపై మాట్లాడిన స్థానిక బీజేపీ ఎమ్మెల్యే హర్మీర్ సింగ్.. ‘‘స్వాతంత్ర్యానికి పూర్వం ఈ గ్రామాన్ని మహేశ్ నగర్ అనే పిలిచేవారు. కాలక్రమంలో కొన్ని కారణాలతో దీన్ని మార్చాల్సి వచ్చింది, ఇప్పుడు మళ్లీ ఈ గ్రామానికి పాతపేరునే పెట్టాం’’ అని పేర్కొన్నారు.

English Title
Rajasthan's Miyan Ka Bara renamed as Mahesh Nagar
Related News