ఆ ఫొటోను మాత్రం పోస్ట్ చేయను

Raj Tarun

వరుస పరాజయాలతో ఢీలా పడ్డ రాజ్ ‌తరుణ్ చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్ చేశాడు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రాజ్ తరుణ్.. ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.

‘‘మీ తరువాతి చిత్రం ఏంటి..? ఎవరితో’’ అని అడగగా.. ‘‘అవికా గౌర్‌ను అడగండి’’ అంటూ సమాధానం ఇచ్చాడు రాజ్ తరుణ్. ఇక ‘‘మీ పెళ్లెప్పుడు’’ అనే ప్రశ్నకు ‘‘వచ్చే ఏడాది’’.. ‘‘మహేశ్ బాబును ఎఫ్పుడు కలుస్తారు..? ఆయనతో ఓ ఫొటో దిగి పోస్ట్ చేయొచ్చు కదా’’ అన్న ప్రశ్నకు నేను కలిశాను. ‘‘ఫొటో కూడా దిగాను. కానీ అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయను. చనిపోయేవరకు నాతోనే ఉంచుకుంటాను. అది నా వ్యక్తిగత విషయం’’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక ‘‘మంచి కథలను ఎంచుకోవచ్చు కదా’’ అన్న ప్రశ్నకు ‘‘అదే పనిలో ఉన్నా. అందుకే ఆలస్యం అవుతుంది’’.. ‘‘కనీసం మీ ట్విట్టర్‌ ఫొటో అయినా మార్చర్చు’’ కదా అన్న ప్రశ్నకు ‘‘ఆ ఫొటోను రత్నవేలు గారు తీశారు. నేనెప్పటికీ దానిని మార్చను. సారీ’’ అంటూ సమాధానం ఇచ్చాడు.

‘‘టాలీవుడ్‌లో మీరు కలిసిన ఉత్తమ వ్యక్తి ఎవరు..?’’ అన్న ప్రశ్నకు ‘‘ఉయ్యాల జంపాల నిర్మాత రామ్మోహన్’’.. ‘‘మీలో ఉన్న హిడెన్ టాలెంట్ ఏంటి’’ అన్న ప్రశ్నకు ‘‘పాటలు రాస్తాను. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రంగుల రాట్నం చిత్రాలలో ఒక్కో పాట రాశాను. అలాగే ఉయ్యాల జంపాల చిత్రానికి అసిస్టెంట్‌గా పనిచేశాను’’ అని చెప్పాడు. ఇక ‘‘మీరు వర్జినా’’ అన్న ప్రశ్నకు ‘‘కాదు’’ అంటూ సమాధానం ఇచ్చాడు రాజ్ తరుణ్.

సంబంధిత వార్తలు