రియల్ హీరో ‘విశాల్’ హృదయం!

Updated By ManamSat, 06/09/2018 - 20:24
Tamil actor Vishal announced he donates Abhimanyudu movie profit telugu farmers Vishal, Abhimanyudu movie, movie profit telugu farmers, Tamil actor Vishal

Tamil actor Vishal announced he donates Abhimanyudu movie profit telugu farmers Vishal, Abhimanyudu movie, movie profit telugu farmers, Tamil actor Vishalతమిళ హీరో విశాల్ తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నాడు. ఒక నటుడిగా, నిర్మాతగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా, సామాజిక కార్యకర్తగా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న విశాల్ తెలుగు రాష్ట్రాల్లోని రైతుల పట్ల తన దయగుణాన్ని చాటుకున్నాడు. విశాల్ నటించిన ‘అభిమన్యుడు’ తమిళ, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకొని రికార్డ్ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12 కోట్లు రాబట్టడమే కాకుండా రెండో వారంలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో తెగిన ప్రతి టికెట్‌పై ఒక్క రూపాయిని తెలుగు రైతులకు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా తన సినిమా లాభాల్లో వాటా ఇవ్వబోతున్నానని ప్రకటించడంతో విశాల్‌‌కు ప్రశంసల జల్లు కురుస్తోంది. తెలుగు నాట కూడా విశాల్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు ప్రేక్షకులకూ సైతం విశాల్ సుపరిచితుడే కావడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ తన మార్కెట్‌ను పెంచుకునేందుకు విశాల్ ఆసక్తిని చూపిస్తున్నాడు.

English Title
రియల్ హీరో ‘విశాల్’ హృదయం!
Related News