భయం గుప్పిట్లో లంక గ్రామాల ప్రజలు..

Updated By ManamThu, 07/12/2018 - 10:20
Rain In Telugu States: rain-in-continuous since-last-night

Rain In Telugu States: rain-in-continuous since-last-night

హైదరాబాద్: ఉత్తర ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు మెండుగా ఉండటంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో ఒడిశా, చత్తీస్‌ఘడ్, తెలంగాణలోని పలుప్రాంతాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా హైదరాబాద్‌లో బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో, కోస్తాఆంధ్రలోని తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉదృతి పెరిగింది. 

సముద్రతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించడం జరిగింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణ సరిహద్దుల్లోని ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. అదిలాబాద్ జిల్లాలోని కడెం రిజర్వాయర్ వద్ద నీరు అధికంగా చేరుకోవడంతో గేట్లు ఎత్తేసి దిగువకు నీటిని వదులుతున్నారు.

ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. ముక్తేశ్వరం-కోటిపల్లి మధ్య  గోదావరి పోటెత్తడంతో గ్రామాల్లో వేసిన మట్టిబాట పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ధవేళేశ్వర వద్ద నీటిమట్టంపెరుగుతోంది. బ్యారేజీ నుంచి నీటిని వదిలేందుకు అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గోదావరికి వరదనీరు పోటెత్తడంతో లంక గ్రామాలు ప్రమాదపు అంచుల్లో చిక్కుకున్నాయి. వరద ఉదృతి పెరిగే కొద్ది లంక గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. మొత్తం 24 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయని తెలుస్తోంది. కాగా.. రేపు, ఈ నెల 16న అల్పపీడనాలు ఏర్పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

English Title
Rain In Telugu States: rain-in-continuous since-last-night
Related News