అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం

Updated By ManamThu, 07/12/2018 - 08:51
Heavy rains in AP, TG

Heavy rains in AP, TG

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో జన జీవనం అస్తవ్యస్థమైంది. ముఖ్యంగా బుధవారం అర్దరాత్రి నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వర్షం తెరిపిలేకుండా పడుతూనే ఉంది. దీంతో ఈ ఉదయం స్కూళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లాల్సిన ఉద్యోగులు తీవ్ర ఇక్కట్టు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు చేరగా, లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు ప్రవేశించడంతో ఇళ్లలో నుంచి బయటికి రావడానికి జనాలు భయపడుతున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగింది.

నగరంలోని.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సనత్‌నగర్, యూసఫ్‌గూడ, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్, పఠాన్‌చెరు, లక్డీకాపూల్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్, ఆర్టీసీక్రాస్ రోడ్, బాగ్‌లింగంపల్లి, రాంనగర్, ఓయూ, ఉప్పల్‌లో వర్షం ఇంకా పడుతూనే ఉన్నది. కాగా ఇవాళ, రేపు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మరోవైపు.. పశ్చిమగోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి అత్తిలి, ఉండ్రాజవరం, తణుకు, ఇరగవరం మండలాల్లో పంటలు నీటమునిగాయి. వర్షాలతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు.

English Title
Rain In Telugu States: rain-in-continues since-last-night
Related News