రెహమాన్ డైరెక్షన్

Updated By ManamTue, 10/23/2018 - 03:23
rahman

మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ ఇటీవలే ఓ మ్యూజిక్ ఆల్బమ్‌తో ప్రొడక్షన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా ఆయనో వీడియో సాంగ్‌ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారట. వివరాల్లోకెళ్తే.. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లో 2018 ప్రపంచ హాకీ వరల్డ్‌కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభ వేడుకల కోసం ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. ప్రముఖ రచయిత గుల్జార్ రాసిన ఈ పాటకు ఎ.ఆర్.రెహమాన్ సంగీత స్వరాలను అందించడమే కాకుండా.. ఈ పాటను ఆయన టీమ్‌తో కలిసి డైరెక్షన్ కూడా చేయబోతున్నారు.
 

image


మరో ఆసక్తికరమైన విషయమేమంటే ఈ పాటలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించనున్నారు. అలాగే ప్రారంభోత్సవ వేడుకల్లో ఎ.ఆర్.రెహామాన్ లైవ్ పెర్ఫామెన్స్ కూడా ఇవ్వబోతున్నారు. నవంబర్ 28 నుండి డిసెంబర్ 16 వరకు హాకీ ప్రపంచ కప్‌ను నిర్వహించబోతున్నారు. 

English Title
Rahman Direction
Related News