హాఫ్ మిలియన్‌ మార్క్‌‌ చేరువలో  ‘సమ్మోహనం’ 

Updated By ManamSat, 06/23/2018 - 20:16
half milion mark, Sammohanam movie, overseas by Nirvana cinemas

half milion mark, Sammohanam movie, overseas by Nirvana cinemasహైదరాబాద్‌: యువ హీరో సుధీర్‌బాబు నటించిన ‘సమ్మోహనం’ మంచి హిట్ టాక్ అందుకుంది. ఈ నెల 15న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రం ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా విదేశాల్లో విజవంతంగా హాఫ్ మిలియన్ మార్క్‌కు దూసుకెళ్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఓ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసింది. ఈ సినిమా విదేశాల్లో సుధీర్‌బాబు విలన్‌గా నటించిన బాలీవుడ్‌ సినిమా ‘బాఘీ’ కలెక్షన్స్‌ను అధిగమించిందని పేర్కొంది. ‘సమ్మోహనం’ చిత్రంలో సుధీర్‌బాబు జంటగా బాలీవుడ్‌ నటి అదితి రావు హైదరి నటించారు.

శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించగా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ బాణీలు అందించారు. ఒక అగ్ర క‌థానాయిక‌కు... సినిమా ప్ర‌పంచం భ‌యంక‌ర‌మైన‌ద‌ని భావించే ఓ సామాన్యమైన యువ‌కుడికీ మ‌ధ్య ప్రేమ నేప‌థ్యంలో సాగే క‌థే ఈ చిత్రం. క‌థానాయిక‌లు కూడా మ‌నుషులే, వాళ్లూ సామాన్య‌మైన జీవితాన్ని గ‌డ‌పడానికి ఇష్ట‌ప‌డ‌తార‌నే విష‌యంతో పాటు... బ‌య‌ట మాట్లాడుకొనేంత చెత్తగా చిత్ర ప‌రిశ్ర‌మ ఉండ‌ద‌నే ఓ సందేశాన్ని ఇచ్చారు.
half milion mark, Sammohanam movie, overseas by Nirvana cinemas

English Title
Racing towards half milion mark Sammohanam movie in overseas by Nirvana cinemas
Related News