స్కూల్ ఫీజు కట్టలేదని...దారుణం

Updated By ManamWed, 07/11/2018 - 13:50
Rabea Girls Public School
Rabea Girls Public School

న్యూఢిల్లీ : స్కూల్ ఫీజు కట్టడం ఆలస్యం అయినందుకు యాజమాన్యం దారుణంగా వ్యవహరించింది. ఫీజు కట్టని విద్యార్థులను స్కూల్ భవనం బేస్‌మెంట్‌లో బంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రయివేట్ స్కూల్‌లో ఈ నెల 9వ తేదీన సుమారు 60మంది కిండర్ గార్డెన్ విద్యార్థులను బేస్‌మెంట్‌లో సుమారు నాలుగు గంటల పాటు నిర్బంధించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.  

Rabea Girls Public School కాగా ఈ ఘటనపై స్కూల్ హెడ్ మాస్టర్ ఫరా దిబా మాట్లాడుతూ.. ‘బేస్‌మెంట్‌ పిల్లలు ఆడుకుంటున్నారు. వారితో పాటు ఇద్దరు టీచర్లు కూడా ఉన్నారు. సాధారణంగా పిల్లల్ని గ్రౌండ్‌ ఫ్లోర్ లోనే ఆడిస్తాం అయితే అక్కడ ఫ్యాన్ రిపేర్ రావడంతో ఇక్కడ ఉంచాం. అంతేకానీ ఫీజు చెల్లించలేదని చిన్నారులను నిర్భందించినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవం’ అని చెప్పుకొచ్చారు. 

English Title
Rabea Girls Public School locks students in basement after parents fail to pay fee
Related News