మల్లయోధుడిగా రానా

Updated By ManamThu, 05/17/2018 - 19:30
raana

raanaవైవిధ్య‌భ‌రిత‌మైన పాత్రలు చేయడానికి ఆసక్తిని చూపే నటుల్లో యువ క‌థానాయ‌కుడు దగ్గుబాటి రానా ముందు వ‌రుస‌లో ఉంటారు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో.. ‘హథీ మేరే సాథీ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. తర్వాత రానా ఏ సినిమా చేయబోతున్నారనే దానిపై పలు వార్తలు వినిపించినా.. రానా మాత్రం ఓ బయోపిక్‌లో నటించడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు. 1900 కాలంలో.. ఐదు వేలకు పైగా మల్లయుద్ధ పోటీల్లో విజేతగా నిలిచిన కోడి రామూర్తి నాయుడు జీవిత చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కించబోతున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థతో పాటు అంతర్జాతీయ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డికానున్నాయి.

English Title
raana as wrestler
Related News