రైతుల రుణపరిమితి పెంచాలి

Updated By ManamWed, 06/13/2018 - 00:41
image
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కాంగ్రెస్ నేతల వినతి  

imageహైదరాబాద్: రైతులకిచ్చే రుణాల పరిమితి పెంచాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రావణ్‌కుమార్ తదితరులు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి రైతుల సమస్యలను వివరించారు. రుణపరిమితి పెంచకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. రైతులకు రుణ పరిమితి పెంచాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నట్లు చెప్పారు. పంట దిగుబడికి, బ్యాంకులు ఇస్తున్న రుణానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. రైతులకు చందాలు ఇచ్చినట్టుగా చేస్తే ఫలితం ఉండదన్నారు. అనంతరంరైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గిట్టుబాటు ధరలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అనుబంధ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయురంగం సంక్షోభవంలో ఉందన్నారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు పథకం ఎన్నికల్లో లబ్ధి కోసమే అన్నారు.  కందులు, మొక్కజొన్న బకాయిలను విడుదల చేయాలన్నారు. 

English Title
రైతుల రుణపరిమితి పెంచాలి
Related News