నాణ్యమైన పదార్థాలు అందిస్తాం

Updated By ManamWed, 06/13/2018 - 06:46
mysoor
  • బైప్రోడక్ట్స్ ఉత్పత్తితో రైతుకు అదనపు ఆదాయం.. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

  • సీఎఫ్‌టీఆర్‌ఐను సందర్శించిన రాష్ట్ర బృందం.. తెలంగాణలో పనిచేసేందుకు సీఎఫ్‌టీఆర్‌ఐ అంగీకారం

mysoorహైదరాబాద్: వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా కర్ణాటక రాష్ట్రం మైసూర్ లోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ) కేంద్ర కార్యాలయాన్ని మంత్రి పోచారం ఆధ్వర్యంలోని బృందం మంగళవారం సందర్శించింది. రాష్ట్ర బృందం పలు ఉత్పత్తుల తయారీ, నిల్వ, మార్కెట్ లో దానికున్న అవకాశాలను పరిశీలించింది. వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తుల నుంచి వ్యాల్యూయాడెడ్ ప్రోడక్ట్స్ తయారుచేసి మరింత విలువను జోడించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సీఎఫ్‌టీఆర్‌ఐ అంగీ కారం తెలిపింది. అంతకుముందు సీఎఫ్‌టీఆర్‌ఐ కార్యాల యానికి చేరుకున్న రాష్ట్ర బృందానికి సీఎఫ్‌టీఆర్‌ఐ అధికా రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పైలెట్ ప్లాంట్ ను సందర్శించి దోశ, చపాతి, ఇడ్లీని యంత్రాల ద్వారా తయారు చేసే విధానాన్ని పోచారం బృందం పరిశీలించింది. వేరుశనగ విత్తనాలను వేయించే, ప్యాకింగ్ చేసే యంత్రం ప్రత్యేకతను అధికారులు వారికి వివరించారు. మొక్కజొన్న నుంచి బిస్కెట్లు, కుకీస్, పౌడర్ వంటి ఉత్పత్తుల తయారీ, ప్యాకింగ్‌ను పరిశీలించారు. పసుపు ప్రాసెసింగ్ టెక్నాలజీపై రాష్ట్ర బృందం ఎక్కువగా ఆసక్తిని కనబర్చింది. పసుపు నుంచి వంట కోసం వాడే పౌడర్‌తో పాటు పారిశ్రామిక అవసరాల కోసం కర్కుమిన్, పోలేయారెజిన్ వంటి ఉపఉత్పత్తులను తయారు చేయడం వల్ల రైతులకు అధిక లాభాలు వస్తాయని సీఎఫ్‌టీఆర్‌ఐ అధికారులు వివరించారు. సాధారణ పద్ధతుల్లో పసుపును పొడిగా మార్చడానికి 45 రోజుల సమయం అవసరం అవుతుండగా, సీఎఫ్‌టీఆర్‌ఐ అభివృద్ధి చేసిన టెక్నాలజీతో కేవలం ఎనిమిది గంటల్లోనే పని పూర్తి చేయవచ్చు. అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పండిస్తున్న పంటలు, విస్తీర్ణం, ఉత్పత్తి, వినియోగం, మార్కెటిం గ్ వంటి అంశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి సీఎఫ్‌టీఆర్‌ఐ అధికారులకు వివరించారు. సీఎఫ్‌టీ ఆర్‌ఐ శాస్త్రవేత్తలు, అధికారుల తో కూడిన బృందం త్వరలో తెలంగాణ పర్యటనకు వస్తుంద ని అక్కడి అధికారులు తెలిపారు. రాష్ట్ర ఉద్యానశాఖ సిద్ధిపేట జిల్లాలోని ములుగులో నిర్మిస్తున్న స్పైస్ ప్లాంట్ డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను సీఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ జితేందర్‌జాదవ్ మంత్రి పోచారానికి అందజేశారు. ఈ బృందంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, జయేష్‌రంజన్,  ఉద్యానశాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, ఎండీ లక్ష్మీబాయి తదితరులు ఉన్నారు.


సచ్చిదానంద స్వామి ఆశీర్వాదం
వైుసూర్ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచార శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారానికి స్వామిజీ అధ్యాత్మిక పుస్తకాలను బహుకరించారు.

Tags
English Title
Quality materials are provided




Related News