సింధు, ప్రణయ్ ఔట్.. క్వార్టర్స్‌లోకి కిదాంబి

Updated By ManamThu, 09/13/2018 - 17:08
Japan Open, PV Sindhu, HS Prannoy, Kidambi Srikanth 
  • జపాన్ ఓపెన్ నుంచి ఇద్దరు భారత షటర్లు నిష్ర్కమణ

Japan Open, PV Sindhu, HS Prannoy, Kidambi Srikanth టోక్యో: జపాన్ ఓపెన్ టోర్నమెంట్‌ నుంచి భారత షట్లర్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ నిష్ర్కమించారు. మరో భారత షట్లర్ 7వ సీడ్‌గా బరిలోకి దిగిన కిదాంబీ శ్రీకాంత్ ఒక్కడే పురుషుల సింగిల్స్ విభాగంలో విజయం సాధించాడు. హంకాంగ్ క్రీడాకారుడు వింగ్ కి విన్సెంట్ వాంగ్‌ను 16వ రౌండ్‌లో 21-14, 21-15 తేడాతో గెలుపొందాడు. కామన్ వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన కిదాంబీ క్వార్టర్స్ దూసుకెళ్లాడు. కొరియా క్రీడాకారుడు లీ డంగ్ క్వెయిన్‌తో శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో మూడో సీడెడ్‌గా బరిలోకి దిగిన సింధు తొలి రౌండ్‌లో ప్రపంచ నెంబర్ 14 గాయో ఫంగ్జీ (చైనా) చేతిలో అలవోకగా గెలిచినప్పటికీ 16వ రౌండ్‌లో 18-21, 19-21 తేడాతో పరాజయం పాలైంది.

అలాగే పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ 10 అంటోనీ గింటింగ్ (ఇండోనేషియా) చేతిలో ప్రణయ్ కూడా 16వ రౌండ్‌లోనే 14-21, 17-21 తేడాతో ఓటమి చెందాడు. మూడో సీడెడ్‌గా బరిలోకి దిగిన సింధు తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ 13 సయాంక తఖాషిపై 21-17, 7-21, 21-13తో గెలుపొందింది. చైనా క్రీడాకారిణి గాయోతో చైనా ఓపెన్‌లో ఒకసారి మాత్రమే సింధు తలపడగా.. నేరుగా ఆడిన ఆటల్లో 21-11, 21-10 తేడాతో గాయో చేతిలో పరాజయం పాలైంది. 

English Title
PV Sindhu, HS Prannoy crash out; Kidambi Srikanth wins
Related News