సామాన్య భక్తుడిలా శ్రీవారికి సేవలు చేస్తా

Updated By ManamWed, 04/11/2018 - 08:43
Putta

Putta తిరుమల: ఓ సామాన్య భక్తుడిలా శ్రీవారికి సేవలు చేస్తానని టీటీడీ కొత్త చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. తనకు టీటీడీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చినందుకు సీఎంకు రుణపడి ఉంటానని.. పాలకమండలిలో సభ్యుడిగా చేసిన అనుభవాలతో ముందుకెళ్తానని పేర్కొన్నారు. పాలకమండలి నియామకం తరువాత టీటీడీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెడతానని.. ఎవరికీ అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన తెలిపారు. అయితే టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

English Title
Putta Sudhakar Yadav selected as TTD chairman
Related News