91వ పడిలోకి అద్వానీ

Updated By ManamThu, 11/08/2018 - 23:03
LK Advani
  • ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

modiన్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ గురువారం 91వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ రాజకీయాలకు, పార్టీ పురోభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు.

English Title
Put in the 91st
Related News