ప్రియాంక చోప్రాకు ఎంగేజ్‌మెంట్..? 

Updated By ManamSun, 07/08/2018 - 16:26
Priyanka Chopra, Nick Jonas, spark engagement rumours, wearing matching gold rings

Priyanka Chopra, Nick Jonas, spark engagement rumours, wearing matching gold ringsహాలీవుడ్ సినిమాల్లో నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, ఆమె ప్రియుడు గాయకుడు నిక్ జోనాస్‌‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇరువురు తమ కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్, భారత్‌లో వివాహ వేడుకల్లో జంటగా కనిపిస్తున్నారు. గత ఏడాదిలో మమెట్ గాలాలో రొమాంటిక్ బైక్ రైడింగ్ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ప్రియాంక, నిక్ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Priyanka Chopra, Nick Jonas, spark engagement rumours, wearing matching gold ringsఈ వార్తలకు బలాన్ని చేకూర్చేలా ప్రియాంక, నిక్‌లకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ వార్త బాలీవుడ్‌లో పెద్ద టాపిక్‌గా మారింది. ఇటీవల ప్రియాంక, నిక్‌ జంటగా కనిపించినప్పుడు వారి చేతివేలికి ఒకే రకమైన బంగారు రింగులు ధరించారు. అంటే.. వీరిద్దరికి ఇదివరకే సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందని తెలుస్తోంది. భారత్‌కు వచ్చిన నిక్ ముంబైలో ఆకాశ్ అంబానీ ఎంగేజ్‌మెంట్‌లో ప్రియాంక చోప్రాతో జంటగా మెరిసాడు.
 

 

this is craziness?/ in Mumbai #priyankachopra #nickjonas

A post shared by Priyanka Chopra Fan Page ? ❤︎ (@pcourheartbeat) on

English Title
Priyanka Chopra and Nick Jonas spark engagement rumours as they step out wearing matching gold rings
Related News