మరో చాలెంజ్‌కి సిద్ధం

Updated By ManamTue, 06/19/2018 - 06:58
Samantha

Samanthaప్రస్తుతం ఏడు సక్సెస్‌లతో స్టార్ హీరోయిన్‌గా నెక్స్‌ట్ లెవల్‌కు చేరుకుంది సమంత. ఇప్పుడు సినిమాల ఎంపికలో సమంత స్టైల్ మార్చింది. వైవిధ్యమైన సినిమాలను చేయడానికి ఆసక్తిని చూపిస్తుంది. ప్రస్తుతం థ్రిల్లర్ చిత్రం ‘యూ టర్న్’ రీమేక్‌లో నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావస్తుంది. ఇప్పుడు మరో లేడీ సెంట్రిక్ మూవీలో నటించడానికి సమంత గ్రీన్  సిగ్నల్ ఇచ్చారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి గిరి సయ్యా ఈ సినిమాను తెరకెక్కిస్తారు. క్యారెక్టర్, మూవీ ప్లాట్ నచ్చడం.. చాలెంజింగ్‌గా అనిపించడంతో సమంత సినిమా చేయడానికి ఓకే చెప్పేసిందట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ కాబోతున్నాయి. ఆగస్టులో సినిమా సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది. 

Tags
English Title
Prepare another challenge
Related News