రిఫండ్‌కు సన్నాహాలు

Updated By ManamMon, 06/11/2018 - 22:23
gst

gstన్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జి.ఎస్.టి) అమలులోకి తెచ్చిన తర్వాత కూడా ఎగుమతిదార్లు చెల్లిస్తూ వస్తున్న పన్నులను, ఎంబెడ్డెడ్ వాటితో సహా, రిఫండు చేసే యంత్రాంగాన్ని కనుగొనేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. ‘‘ఎగుమతిదార్లకు అటువంటి చెల్లింపుల వల్ల ఎగుమతులు మరింత పోటీదాయకంగా తయారవడవేుకాక, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఓ) వ్యవస్థ కింద ఎగుమతులు సాగించేందుకు వీలు కలుగుతుంది. ఎందుకంటే, భారతదేశ ఎగుమతి సబ్సిడీలపై ఇటీవలి కాలంలో డబ్ల్యు.టి.ఓలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి’’ అని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ‘‘జి.ఎస్.టి కింద రిఫండ్ కాని పన్నులు కొన్ని ఉన్నాయి. విద్యుత్ సుంకం, పెట్రోలియం వస్తువులపై ‘వ్యాట్’, మార్కెట్ పన్ను, స్టాంప్ డ్యూటీ వంటివాటిని ఎగుమతిదార్లు చెల్లించడం కొనసాగిస్తున్నారు. సంస్తరిత పన్నులు అనేకం ఉన్నాయి. ఈ పన్నులు రిఫండ్ చేయగల యంత్రాంగాన్ని కనుక రూపొందించగలిగితే, అదే గణనీయమైన సహాయం కిందకు వస్తుంది’’ అని ఆ అధికారి చెప్పారు. ఉదాహరణకి, దుస్తుల రంగంలో వివిధ ఎంబెడ్డెడ్ పన్నులు  ఉన్నాయని దుస్తుల ఎగుమతుల ప్రోత్సాహక మండలి చెబుతోంది. పత్తి, విద్యుత్‌పై లెవీలు, రిజిస్టరుకాని డీలర్ల నుంచి కొన్న మానవ తయారీ ఫైబర్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్లపై ఆంక్షలు పరిశ్రమపై అదనంగా 4-5 శాతం భారం పడేట్లు చేస్తున్నాయి. డబ్ల్యు.టి.ఓతో పొత్తు కుదరని ఎగుమతి ప్రోత్సాహక పథకాలను ఉపసంహరించుకున్న వెంటనే ఎగుమతిదార్లకు పరిహారం చేకూర్చే ప్రత్నామ్నాయ మార్గాలను కనుగొనేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక అనియత కమిటీని ఏర్పాటు చేసింది. రిఫండ్ ఇవ్వని పన్నులకు బదులుగా ఎగుమతిదార్లకు పరిహారం చేకూర్చే మార్గాలను ఈ కమిటీ సునిశితంగా పరిశీలిస్తోంది. విదేశీ వర్తక డైరెక్టరేట్ జనరల్ ఈ కమిటీకి అధిపతిగా ఉన్నారు. పరిశ్రమల ప్రతినిధులు, ఆలోచనాశీలురతో కూడిన ఈ లోపాయకారీ కమిటీ, ఈ విషయంలో ఇతర దేశాల అనుభవాలను కూడా అధ్యయనం చేస్తోంది. జి.ఎస్.టికి బయట వదిలేసిన ఉత్పత్తుల (ప్రెట్రోలియం, విద్యుత్)లో పొదిగి ఉన్న పన్నులు, జి.ఎస్.టి పరిధిలోని వస్తువులలో కూడా కొన్నింటిపై అంతర్భాగంగా ఉండిపోయిన పన్నులపై జి.ఎస్.టి కౌన్సిల్ ఒక సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఆసక్తికరంగా, తాజా ఆర్థిక సర్వే సూచించింది. ఉదాహరణకి, జి.ఎస్.టిలో ఉన్న వస్తువులపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్లు కలిసి ఉండవచ్చు. ‘‘పన్ను విపర్యాసం’’ కారణంగా, ఎగుమతిదార్ల చేతికి రాకుండా, ప్రభుత్వం వద్ద నిలిచిపోయి ఉండవచ్చు. ఈ వరుసను గమనిస్తే, ఎగువనున్న వాటిపైనకన్నా, దిగువనున్న వాటిపైనే పన్నులు ఎక్కువగా ఉన్నాయి. ‘‘ఈ సమీక్ష నిక్షిప్త ఎగుమతి పన్నులను వేగంగా తొలగించేందు కు దారితీయాలి. ఫలితంగా, భారతదేశ వస్తూత్పత్తి ఎగుమతులకు ముఖ్యమైన శక్తిని ఇచ్చినట్లవుతుంది’’ అని సర్వే పేర్కొంది. 

Tags
English Title
Preparations for the refund
Related News