ముందస్తు వేడి

Updated By ManamSun, 06/24/2018 - 06:24
image

imageమంచుకొండలు రగిలిపోతున్నాయి. కశ్మీరంలో బుల్లెట్ల మో త మోగిపోతోంది. ఇంతకుముందెన్నడూ కనపడని యుద్ధ వాతావరణం జమ్ము కశ్మీర్ ప్రాంతంలో ఇప్పుడే కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, రంజాన్ సందర్భంగా ప్రకటించిన కా ల్పుల విరమణను రంజాన్ మాసం ముగిసిపోగానే ఉప సంహరించుకున్న కేంద్రం.. ఆ పేరు చెప్పే జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని పీడీపీ సర్కారుతో తెగదెంపులు చేసుకుంది. కాల్పుల విరమణను మరికొన్నాళ్లు కొనసాగించాలని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కోరడం, దానికి బీజేపీ తిరస్కరించడం, ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చి అక్కడ గవర్నర్ పాలన విధించడం లాంటి పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. వీటన్నింటికీ వెన క ఉన్న ప్రధాన శక్తి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అనే అంటున్నారు. పార్టీలో కశ్మీర్ వ్యవహారాలను ఎప్పటి నుంచో చూస్తున్న ఆయన.. పార్టీ ఆలోచనలకు అను గుణంగానే అక్కడ నిర్ణయాలు కూడా తీసుకుంటారు. పార్టీ అధిష్ఠానంలో కీలకపాత్ర పోషించే రాం మాధవ్.. ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాల మనసు లో ఏముందో గ్రహించడంతో పాటు కీలక విషయాల్లో వారితో చర్చించి తన ఆలోచనలను చెప్పగల అతి కొద్ది మందిలో ఒకరు. కశ్మీర్‌లో గవర్నర్ పాలన అమలులోకి వచ్చిన అతి కొద్ది సమయానికే అక్కడ మరో అతిపెద్ద మా ర్పు కనిపించింది.

వ్యూహం మారిందా?
 ఇంతకుముందు ఉగ్రవాదుల మీద పోరుకు సైన్యాన్ని మాత్రమే రంగంలోకి దించిన కేంద్ర ప్రభుత్వం.. ఈసారి గతంలో ఎన్నడూ లేనట్లుగా ఎన్‌ఎస్‌జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్) బలగాలను సైతం మోహరిం చింది. ఇంటెలిజెన్స్ నిఘాను సైతం ముమ్మరం చేసింది. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించామన్న ఘనతను సొంతం చేసుకోవ డంతో పాటు అవసరమైతే పాకిస్థాన్ మీద యుద్ధాన్ని ప్రక టించడానికి సైతం సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా కనిపి స్తోంది. ఇప్పటివరకు ఉగ్రవాదుల జాడ కనిపిస్తే మాత్రమే భద్రతాదళాలు కాల్పులు జరపడం, ఎన్‌కౌంటర్లలో వారిని హతమార్చడం లాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం సరికొత్తగా అగ్రనాయకులు అనుకున్న 21 మందితో ఒక హిట్‌లిస్టును కూడా తయారుచేశారు. వాళ్లందరినీ హతమా రిస్తే కేడర్ కకావికలం అయిపోతుందని గుర్తించారు. ఈ పరి ణామాలన్నింటినీ జాగ్రత్తగా చూస్తుంటే, ముందస్తు ఎన్నిక లకు బీజేపీ అధిష్ఠానం ఏమైనా సిద్ధమవుతోందా అన్న అను మానాలు కలగక మానవు. డిసెంబరులోనే సార్వత్రిక ఎన్ని కలు నిర్వహించడం ద్వారా ప్రయోజనం పొందాలన్న యోచనలో మోదీ-షా ద్వయం ఉందన్న మాటలు విని పిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. 2014 ఎన్నికల సమయానికి అప్పటికి యూపీఏ ప్రభుత్వం రెండు విడతలుగా అధికారంలో కొన సాగింది. దానివల్ల ప్రభుత్వ వ్యతిరేకత దేశవ్యాప్తంగా చాలా ఎక్కువ స్థాయిలో ఉండేది.

దానికి తోడు కామన్వెల్త్ క్రీడల కుంభోణం, 2జీ స్కాం, బొగ్గు కుంభకోణం.. ఇలా అనేక రకాలుగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయం లో క్లీన్ ఇమేజ్ ఉండి, గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ వచ్చిన మోదీ ప్రజలకు ఆశాకిరణంలా కనిపించారు. నిజం గానే దేశాన్ని రెండంకెల వృద్ధిరేటు దిశగా పరుగులు పెట్టిస్తా రేమో, గుజరాత్‌లో ఆయన చెబుతున్న లాంటి అభివృద్ధి దేశ మంతా సాధ్యమవుతుందేమోనని అనుకున్నారు. అందుకే ‘అబ్‌కీ బార్ మోదీ సర్కార్’ అన్న నినాదం దేశవ్యాప్తంగా గట్టిగానే వినిపించింది. ఉత్తర, దక్షిణ భారతాలతో పాటు ఎక్కడికెళ్లినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఫలి తంగా తిరుగులేని మెజారిటీతో మోదీ సర్కారు ఎర్రకోటపై జెండా ఎగరేసింది. అంతవరకు బాగానే ఉన్నా ఆయన చెప్పి న విధంగా అవినీతి అంతం కాలేదు, విదేశాల్లో మూలుగు తున్న నల్లధనం ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలేదు, ఉద్యోగాల కల్పన కూడా సాధ్యం కాలేదు, రైతులకు గిట్టు బాటు ధరలు ఇంతవరకు అమలు కాలేదు, వృద్ధిరేటు పరు గులు పెట్టడం మాట అటుంచి ఇంకా లేచి నిలబడే పరి స్థితిలో లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి భారాలు సామాన్యుల నడ్డి విరగ్గొట్టాయి. దేశంలో చాలాచోట్ల ఈ అంశాలపై ప్రభుత్వం మీద తక్కువ కాలం లోనే వ్యతిరేకత మొదలైంది. ప్రభుత్వంలోని మంత్రులలో అవినీతి లేకపోవచ్చు గానీ.. అభివృద్ధి కూడా ఏమంత లేదు కదా అన్న వాదన వినిపిస్తోంది. మరి ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల బీజేపీకి ప్రయోజనం ఏముంటుంది? సరిగ్గా ఇదే అంశం మీద బీజేపీ కోర్ కమిటీలో చర్చలు జరిగాయంటున్నారు. ఏళ్లు గడిచేకొద్దీ ఈ అసంతృప్తి మరింతగా పెరుగుతుందే గానీ ఇప్పటి కిప్పుడు తగ్గిపోవడం, మళ్లీ మోదీ-షా ప్రతిష్ఠ వెలిగిపోవడం అసాధ్యం కాబట్టి ఏదో ఒకటి చేయాలని అనుకుంటన్నారు. అందుకే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణిచేయడంతో పాటు అవసరమైతే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మళ్లీ భారతదేశం ఆధీనంలోకి తెచ్చుకునేవరకు కూడా వెళ్లాలని భావిస్తున్నారు. అందుకు ఏకైక మార్గం.. పాక్‌తో యుద్ధం చేయడమే. అందు కే ఇటీవలి కాలంలో రక్షణ కొనుగోళ్ల ఒప్పందాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

ఆర్మీ చీఫ్ మాటలే నిదర్శనం
పైకి ఏమీ పెద్దగా మాట్లాడ కుండానే అధినేతల మనసులో ఉన్న మాట ఎరిగి మసలుకునే రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోతు న్నారు. మనోహర్ పరికర్ తర్వాత అంత సమర్ధంగా రక్షణశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె.. పైనుం చి వస్తున్న సూచనలకు అనుగుణంగా చకచకా పావులు కదు పుతున్నారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఘాటు వ్యాఖ్యలు చేస్తు న్నా ఏమీ మాట్లాడటం లేదంటే.. దాని వెనుక ఏదో గట్టి వ్యూహమే ఉందని నమ్మక తప్పదు. పాక్ మీద దాదాపు యుద్ధం చేసినంత పరిస్థితి వరకు రావడం ద్వారా ఒక్కసారి గా దేశవ్యాప్తంగా మళ్లీ జాతీయత భావాలను రెచ్చగొట్టి.. సరిగ్గా అలాంటి తరుణంలోనే ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందా లన్నది కమలనాథుల వ్యూహంలా కనిపిస్తోంది. అప్పుడైతే తమకు ఎన్నికల్లో లబ్ధి కలిగే అవకాశం ఉంటుందని భావి స్తున్నారు. ముందు జాగ్రత్తగా కశ్మీర్‌లో అందుకు సన్నాహాలు చేసుకోడానికే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. కాల్పు ల విరమణ ఉపసంహరణకే ఒప్పుకోని మెహబూబా ముఫ్తీ.. ఇక ఉగ్రవాదుల ఏరివేత పేరుతో అక్కడ చర్యలు గట్టిగా చేపడితే ఎలా స్పందిస్తారోనన్నది రాం మాధవ్ లాంటి వాళ్లకు ముందే తెలుసు. అందులోనూ అక్కడ ఎన్‌కౌంటర్ చేయడానికి వెళ్లే భద్రతా దళాల మీద రాళ్లు వేసేందకు కొంత మంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కోడానికే ఎన్‌ఎస్‌జీ కమాండోలను కూడా రంగంలోకి దించారు. దాంతో యుద్ధ సన్నాహాలకు పూర్తిస్థాయిలో సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష యుద్ధం కాకపోయినా, గతంలో చేసినట్లుగా సర్జికల్ స్ట్రైక్ లాంటివి చేసే అవకాశం సైతం లేకపోలేదు. డిసెంబరు నెలలో ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్యులు సైతం చెప్పడం కూడా ఇందుకు ఊతమిస్తోంది.

ముందస్తుకు చంద్రులు సిద్ధం!
ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే వాటిని ఎదుర్కో డానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన ఇద్దరు చంద్రులు పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ము మ్మరంగా సాగుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో పాటు వర్గాల వారీగా అందించిన ప్రయోజనాల కారణంగా ప్రభుత్వ వ్యతిరేకత అన్నది దాదాపుగా లేనట్లేనని అంటున్నారు. రుణమాఫీ చేయడంతో పాటు మిషన్ కాకతీ య పనులు చేపట్టడం వల్ల చెరువులు నిండి, వ్యవసాయం ముమ్మరంగా సాగుతోంది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల పను లు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. ఏదైనా సమస్యను మంత్రుల దృష్టికి తీసుకెళ్తే చాలావరకు తక్షణ పరిష్కారం లభిస్తోంది. వీటన్నింటి దృష్ట్యా ప్రభుత్వం మీద అనుకు న్నంత వ్యతిరేకత లేదనే అంటున్నారు. దీనికి తోడు ఇతర పార్టీల నుంచి కీలక నేతలు చాలామంది ఈ నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌లోకి దూకారు. ఫలితంగా పార్టీ మరింత బలోపే తం అయ్యింది. అదే సమయంలో ఇతర పార్టీలు బలహీనం అవుతున్నాయి. ఇటు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం లేదా.. వేరే దారి చూసుకోవడంతో ఆ పార్టీల్లో పెద్ద నాయకులు అనుకున్న వాళ్లు చేజారిపోతున్నారు. కాంగ్రెస్ విషయానికే వస్తే.. నాగం జనార్దనరెడ్డి లాంటివాళ్లు వచ్చారని సంతోషపడాలో.. లేక అక్కడ దామోదర్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని కోల్పో యినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి. అలాగే దానం నాగేందర్, టి.అంజయ్య కుమారుడు పార్టీని వీడి వెళ్లిపోయారు.

ముఖేష్ గౌడ్ కూడా దాదాపు అదే ఆలోచన లో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. టీజేఎస్, బీఎల్ ఎఫ్, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ప్రతిపక్షం ముక్కలు చెక్కలుగా చీలిపోయి ఉంది. ఇది కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అంశమే అవుతుంది. మరోవైపు కేసీఆర్ కూడా దూసు కెళ్తూ మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. 
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. వివిధ కార్యక్రమాల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపుగా ప్రజల్లోనే ఉంటున్నారు. దానికితోడు అమరావతిలో శాశ్వత సచివాలయం, హైకోర్టు తదితర ఐకానిక్ భవనాల నిర్మాణా నికి శ్రీకారం చుడుతున్నారు. ఇవన్నీ సాకారం కావాలంటే మరోసారి తానే ముఖ్యమంత్రి కావాలని, అనుభవం లేని వాళ్లు వీటిని సరిగా హ్యాండిల్ చేయలేరని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, తెలంగాణకు, ఆంధ్రకు ఒక విష యంలో తేడా ఉంది. తెలంగాణలో అంతగా లేని ప్రభుత్వ వ్యతిరేకత ఆంధ్రాలో చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. ఉద్యో గాలు రాకపోవడం, ఇస్తామన్న నిరుద్యోగ భృతిని కూడా నాలుగేళ్ల పాటు ఇవ్వకుండా ఇప్పుడు, అది కూడా కోతలు పెట్టి ఇస్తామంటుండటం లాంటివాటితో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, శాఖలలో పెచ్చుమీరిన అవినీతి స్పష్టంగా కనిపిస్తోంది. దానికితోడు చాలామంది ఎమ్మెల్యేల మీద క్షేత్రస్థాయిలో వ్యతిరేకత పెరిగిపోయింది. ప్రతిపక్ష నాయకు డు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపడుతున్న పాదయాత్రకు వస్తున్న జన సందోహమే ఇందుకు నిదర్శనం. గత ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన జగన్.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కసిగా ఉన్నారు. పాదయాత్రను దాదాపు పూర్తిచేసేస్తున్నారు. ఇప్ప టికే తూర్పుగోదావరి వరకు చేరుకున్న ఆయన.. ఇక విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తిరిగితే సరిపోతుంది. ఆయనకు చాలా ప్రాంతాల్లో జనాదరణ బాగానే కనిపించిం ది. గత ఎన్నికల్లో టీడీపీని ఆదరించి పెద్దపీట వేసిన గోదావరి జిల్లాల్లో సైతం పాదయాత్రలకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ సైతం పోరాట యాత్రల పేరుతో జనంలోకి వెళ్తున్నారు. అయితే, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిలబెట్టడానికి సరైన అభ్యర్థులను వెతుక్కోవడం, వారందరి ప్రచారపర్వం లాంటి వాటికే ఆయనకు సమయం సరిపోతుందా లేదా అన్నది అనుమానంగా ఉంది. ఒకవేళ కేంద్రం అనుకుంటున్నట్లుగా డిసెంబరులోనే ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం అది పవన్ లాంటి కొత్త నాయకులకు ఇబ్బందికరమే అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితులను ఆయన ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంటుంది. 

chandra shekhara sharma

English Title
Pre-heat
Related News