ఆయన కమిట్‌మెంట్‌కు ముగ్ధుడినయ్యా

Updated By ManamFri, 08/10/2018 - 16:59
Prakash Raj

Prakash Rajఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియాలో మాస్ర్టో ఇళయరాజాను కలిశారు. సిడ్నీలో ఇళయరాజా ఓ ప్రోగ్రామ్‌ను ఇవ్వనుండగా.. అక్కడకు ప్రకాశ్ రాజ్ కూడా వెళ్లారు. ఈ సందర్భంగా మాస్ట్రోతో ఫొటో తీసుకున్న ప్రకాశ్ రాజ్ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇళయరాజా సర్‌తో కొత్త సమయాన్ని గడిపా. ఓ కార్యక్రమం కోసం ఆయన రిహార్సల్స్ చేస్తున్నాను. ఆయన కమిట్‌మెంట్ నన్ను ముగ్ధుడిని చేసింది. ద జాయ్ ఆఫ్ లెర్నింగ్ అంటూ పోస్ట్ చేశారు.

 

English Title
Prakash Raj praises on Ilayaraja
Related News