వైఎస్ జగన్ నేటి పాదయాత్ర సాగనుందిలా..

Updated By ManamThu, 05/10/2018 - 07:30
Praja Sankalpa Yatra Day 158 Schedule

Praja Sankalpa Yatra Day 158 Schedule

కృష్ణా: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ 157 రోజులు పూర్తైంది. ప్రస్తుతం కృష్ణాజిల్లాలో జగన్ పాదయాత్ర సాగిస్తున్నారు. నేటి 158వ రోజు పాదయాత్ర.. ఉదయం పెరికెగూడెం నుంచి ప్రారంభమై కొర్లపాడు క్రాస్ మీదుగా గన్నవరం క్రాస్ వరకు సాగనుంది. కాగా ఇవాళ పాదయాత్ర ముగించుకున్న అనంతరం అక్కడ్నుంచి నేరుగా హైదరాబాద్‌కు ఆయన రానున్నారు. ఇవాళ మొత్తం కుటుంబీకులతో గడిపి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరై అనంతరం అక్కడ్నుంచి నేరుగా పాదయాత్ర స్థలి వద్దకు ఆయన చేరుకుంటారు.

కాగా.. 157 రోజుల్లో 1,978.5 కిలోమీటర్లు పాదయాత్ర జగన్ పూర్తి  చేశారు. రెండు వేల కిలోమీటర్ల పాద్రయాత్ర పూర్తైన రోజు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకునేందుకు వైసీపీ పార్టీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

English Title
Praja Sankalpa Yatra Day 158 Schedule
Related News