టీమిండియాకు పాక్ దిగ్గజాల ప్రశంసలు

Imran Khan

న్యూఢిల్లీ: లెజెండర్ బౌలర్ వసీం అక్రమ్‌తో పాటు పాకిస్థాన్ క్రికెట్ వర్గం టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా ఘనత సాధించిన విషయం విదితమే. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సమష్టిగా ఎదురుదాడి చేసిందని అక్రమ్ అన్నారు. ‘వేలాది ప్రశంసలకు విరాట్ కోహ్లీ అర్హుడని నేను భావిస్తున్నాను. ఈ విజయం భారత దేశవాళీ క్రికెట్‌ను మరింత ఎత్తుకు తీసుకెళుతుంది’ అని ఆయన చెప్పారు. అంతేకాకుండా పాక్ నూతన ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా కోహ్లీ సేనను కొనియాడారు. ‘ఆస్ట్రేలియాలో టెస్టు తొలిసారి సిరీస్ గెలిచిన ఉప ఖండం జట్టు టీమిండియా, విరాట్ కోహ్లీని నా శుభాక్షాంక్షలు’ అని ఖాన్ ట్వీట్ చేశారు. మరో కెప్టెన్ మొయిన్ ఖాన్.. ‘ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం ఆసియాలోని ఏ జట్టుకైనా సులువు కాదు. కానీ ఈ గెలుపు ఘనత ఖచ్చితంగా టీమిండియాదే’ అని చెప్పారు. మాజీ ఓపెనర్ మొహ్‌సిన్ ఖాన్ స్పందిస్తూ.. బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ కలిసి సమష్టిగా ఈ విజయాన్ని సాధించారు అని అన్నారు. ‘ఈ సిరీస్‌లో చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌తో పాటు ఇతరుల బ్యాటింగ్‌కు ముగ్ధుడనయ్యాను. అంతేకాకుండా ఎలాంటి ఒత్తిడీ లేకుండా బౌలర్లు కూడా బౌలింగ్ చేయగలిగారు’ అని మొహ్‌సిన్ అన్నారు.

Tags

సంబంధిత వార్తలు