పేదల పాలిట పెన్నిధి!

Updated By ManamTue, 05/15/2018 - 00:40
image

imageఇంతవరకూ ఆర్థిక, భౌతిక మూల ధనాలను మాత్రమే గుర్తించిన సామాజి క శాస్త్రాల సాహి త్యం ఇప్పుడిక సా మాజిక, మానవ, సాంస్కృతిక మూల దనాన్ని కూడా గుర్తిస్తోంది. ప్రతి మూల ధనమూ దేనికదే విభిన్నం అన్నట్టుగా పైకి కనిపిస్తున్నప్పటికీ, మూలధనాలన్నీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. ఇచ్చిపుచ్చుకునే విధంగా కూడా ఉంటాయి. అంటే సామాజిక మూలధనం కూడా ఆర్థిక మూలధనంగా మారడానికి అవకాశం ఉంటుంది. సూక్ష్మ ఆర్థిక సంస్థలకు వాయి దాల పద్ధతిలో మహిళా బృందాలు తిరిగి సొమ్ము చెల్లించడాన్ని చూస్తే సామాజిక మూలధనం ఎలా పనిచేస్తుందో అర్థం అవుతుంది. ఇటలీలోని పునరా వృత పరపతి సంఘాల విషయంలో ప్రముఖ ఆర్థిక వేత్త రాబర్ట్ పట్నామ్ చెప్పినట్టు, ప్రతి బృందం లేక స్వయం సహాయక బృందంలోని సభ్యత్వం నమ్మకం మీదా, ఇచ్చిపుచ్చుకునే ధోరణి మీదా ఆధారపడి ఉంటుంది. ఈ స్వయం సహాయక బృందాలు చాలా చిన్న సంఘాలు. ఇవి గట్టి నమ్మకం మీద ఆధారపడి పని చేస్తుంటాయి. 

ఇక్కడ గట్టి నమ్మకం అంటే సంఘంలో లేక బృం దంలోని ఇతర సభ్యుల మీద నమ్మకం అన్న మాట. ఆ సభ్యులు ఎలా ఎప్పుడు ఏ విధంగా తమ సొమ్ము తిరిగి చెల్లిస్తారన్నది తేలికగా అర్థం చేసుకుంటారు. దీనిని చూసే ఇతర ఆర్థిక సహాయ సంస్థలు నగదు స హాయం చేయడానికి, రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తుంటాయి. సామాజిక మూలధనంలో సామాజిక వ్యవస్థల మీద నమ్మకానికి సంబంధించిన సంబంధ బాంధవ్యాలు ఆధారపడి ఉంటాయి. పేదల చేతిలో చిల్లిగవ్వ లేనప్పటికీ, ఆ పరిస్థితి కూడా ఆర్థిక వనరుగా లేక రుణంగా పరిణామం చెందుతుంది. ఇక స్వయం సహాయక బృందం అనేది అందరినీ కలుపుకునిపోయే వ్యవస్థను కలిగి ఉంటుంది. సామా జిక మూలధనంలో ఇదొక అపూర్వమైన ప్రజాస్వామ్య పంథా. మరొక విశేషమేమిటంటే, ఇతర మూలధనా లన్నీ పేదలకు, నిరక్షరాస్యులకు, ఆస్తులు లేనివారికి అందుబాటులో లేనివి కాగా ఈ రకమైన సామాజిక మూలధనం మాత్రం పేదలకు, పూర్తిగా అందు బాటులో ఉంటుంది. 

బహుళ అంచెల నిర్మాణం   
ఇంకా చెప్పాలంటే, సామాజిక మూలధనం బహుళ అంచెల నిర్మాణం లాంటిది. ఇందులో అనేక రూపాలు ఉంటాయి. అయితే, రెండు రకాల సామా జిక మూలధనంలో మాత్రం మనుషుల్ని కలిపేది, కుల మతాలకు అతీతంగా మానవ సంబంధాలను పటిష్ఠం చేసేది ఉంటుంది. మనుషుల మధ్య సంబం ధాలు పటిష్ఠం చేసే సామాజిక మూలధనంలో కొన్ని ప్రత్యేక గుర్తింపులు ఉంటాయి. సామాజిక వర్గానిక న్నా బృందానికే ప్రాధాన్యం ఇస్తాయి. ఇచ్చి పుచ్చుకునే ధోరణిని కలిగి ఉంటాయి. ఇక కులమతాలకు, వర్గాలకు అతీతంగా వ్యవహరించే సామాజిక మూల ధనంలో ఏ వ్యక్తీ తానెవరన్నది ఆలోచించడు. రకరకాల వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలను ఏర్పరుస్తుంటుంది. సహజమైన ఇచ్చిపుచ్చుకునే ధోర ణిని ప్రతిబింబిస్తుంటుంది. 

అయితే, అన్నిటికన్నా ముఖ్యంగా వీటి ఫలితాలు మాత్రం రకరకాలుగా ఉంటాయి. కలుపుకునిపోయే సామాజిక మూలధనంలో పేదలు కొన్నిరకాల సవాళ్లు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా సామాజిక మద్దతు విషయంలో ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా పటిష్ఠ సామాజిక మూల ధనం విషయంలో, ఎప్పటికప్పుడు అవకాశాలు మారిపోతూ ముందుకు దూసుకుపోవడానికి అవకా శం కలుగుతుంటుంది. ఇది సామాజిక స్థాయిని పెం చుతుంది. సూక్ష్మ ఆర్థిక సహాయ సంస్థల (ఎమ్ ఎఫ్‌ఐ) కార్యకలాపాలు ప్రధానంగా రుణాలు ఇవ్వడా నికి, వసూళ్లు జరపడానికే పరిమితం అయిపోయాయి. ఇవి వివిధ వర్గాల మధ్య మద్దతు కూడగట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఉన్న సామాజిక సంబంధాల మీద ఆధారపడి, సాధారణ వినియోగానికి రుణాలు మంజూరు చేయడమనే ఓ ‘లోపభూయిష్ఠమైన రుణ సదుపాయం’గా సూక్ష్మ ఆర్థిక సహాయ సంస్థల కార్యకలాపాలను ఆర్‌బిఐ మా జీ గవర్నర్ ఎస్. రంగరాజన్ దీన్ని అభివర్ణించారు. 

ఇదిలా ఉండగా, పేదలకు పథకాలు రూపొందిం చేటప్పుడు తప్పనిసరిగా సమయం, సందర్భం చూసుకోవాల్సిన అవసరం ఉందని హైదరాబాద్‌లోని 104 బస్తీలలో ఎం.ఐ.టి అధ్యయనం చేసి తేల్చి చెప్పింది. అంతకుముందు కుటుంబాలు అనుభవి స్తున్న స్థితిగతులను కూడా పరిశీలనలోకి తీసుకోవా ల్సి ఉంటుందని అది సూచించింది. అంతకుముందు చిన్నాచితకా వ్యాపారాలు చేస్తున్న సాధారణ కుటుంబా లు సూక్ష్మ ఆర్థిక సహాయ సంస్థల రుణాలు పొంది వాడకపు వస్తువుల వ్యాపారాలను పెంచుకుంటున్నట్టు కూడా అది తెలియజేసింది. ఇక భారీ వ్యాపారాలు చేస్తున్న కుటుంబాలకు ఇవి ఇచ్చే రుణాలు సరిపోక, చిన్నచిన్న వాడకపు వస్తువుల మీద అంటే పొగాకు, మద్యం వంటి వస్తువుల మీద పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. 
   
పేదలకు ఆర్థిక వనరు
అసలు వ్యాపారాలే చేసుకోలేనివారు తాము తీసుకున్న రుణాలను పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఆహారం, అనారోగ్యం వంటి వాటి మీద ఖర్చు చేయడం జరుగుతోంది. అందువల్ల రుణ సౌకర్య ప్రణాళికలను విస్తృతం చేయాలన్నా, మరింత పటిష్ఠపరచాలన్నా వివిధ కుటుంబాల సమయ సందర్భాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబాల వ్యాపార సరళిని, వారి పెట్టుబడుల తీరు తెన్నులను, వారు ఆదాయం పెంచుకునే మార్గాలను తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది. సామాజిక మూలధన వ్యవస్థలో కలుపుకుని పోవడం, పటిష్ఠ పరచడం వంటివి, ఇతర మధ్యంతర నిర్మాణాలు బయటి నుంచి రుణాలను సేకరించుకోవడానికి, ఆక ట్టుకోవడానికి, మూలధన తీరుతెన్నులను సమూలం గా మార్చడానికి ఉపయోగకరంగా ఉంటాయి. 
ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలలోని అను భవాలను పరిశీలనలోకి తీసుకుంటే, సందర్భాన్ని బట్టి ప్రణాళికలు రూపొందించడానికి ఓ మధ్యంతర నిర్మాణంగా ఎమ్.ఎఫ్.ఐలు ఉపయోగపడడానికి వీ లుంది. ఇంతకు ముందే వ్యాపారాలు చేసుకుంటున్న కుటుంబాలకు కొన్ని పటిష్ఠమైన సంబంధాలు అవస రమవుతాయి. రోజువారీ అవసరాలు గడవడానికి, భావోద్వేగ సంబంధంగా ఆధారపడడానికి ఇవి తప్ప నిసరి అవుతాయి. కొత్త ఐడియాల కోసం, మారు తున్న మార్కెట్ పరిస్థితుల్ని తెలుసుకోవడం కోసం, రాజకీయ, కార్యనిర్వహణ సంబంధాల కోసం కుటుం బాలు పటిష్ఠమైన సంబంధాలను ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. అవేవో తటస్థ సంబంధాలుగా కాకుండా చురుకైన సంబంధాలుగా ఉండాలి. అటువంటి వాటి మీదే సామాజిక మూలధన వ్యవస్థలు ఆధారపడి ఉంటాయి. ఆ చురుకైన సంబంధాలు సరైన సమా చారాన్ని అందిస్తూ, పేదల స్థితిగతులను, వారి అవ సరాలను, ఆర్థిక పరిస్థితులను యథాతథంగా తెలియ జేయగలిగి ఉండాలి. 

వ్యాపారాలు చేయలేని స్థితిలో ఉన్న కుటుంబాల కోసం, ఎంఎఫ్‌ఐలు తగినంత శిక్షణనివ్వడమో, ఇతరత్రా సహాయ సహకారాలు అందజేయడమో చేయాల్సి ఉంటుంది. అవసరమైతే స్కూళ్లకు పంప డమో లేదా భాషా సంబంధమైన నైపుణ్యాలు నేర్ప డమో కూడా చేయాలి. వారు రోజువారీ జీవితాన్ని ఎదుర్కొనే విధంగా తగినంతగా వేతనం సంపాదించ డానికి ‘ప్రజా జీవిత నైపుణ్యాల’ను సాధించగలిగి ఉండాలి. పేదలు తమ అవకాశాలను విస్తరించుకో వడానికి, తమకున్న పలుకుబడి ద్వారా, ఇతరత్రా కాంటాక్ట్స్ ద్వారా అవసరమైతే ఉద్యోగాలు సంపా దించుకోవడానికి ఇది చేయూత నందించాల్సి ఉంటుందని పరిశోధనల్లో తేలింది. 

చివరగా, ఆదాయాన్ని పెంచుకుని, జీవితంలో ముందుకు దూసుకువెళ్లాలనే ఆలోచనలున్న సాధారణ కుటుంబాలకు తగిన శిక్షణనిచ్చి, సహాయ సహకా రాలు అందజేసి, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకు వచ్చి, రుణాలు అందజేసేవారిని గుర్తించి, వారు వ్యాపారాల్లో స్థిరపడడానికి, మూలధన సేకరణలో ముందుడుగు వేయడానికి  చేయూతనందించాల్సి ఉం టుంది. మొత్తం మీద సామాజిక మూలధనమంటే సంబంధ బాంధవ్యాలను పటిష్ఠపరచుకోవడం. ఇతర మూలధనాలకు భిన్నంగా సామాజిక మూలధనం పేదలకు, ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారికి అండ దండలనివ్వాల్సి ఉంటుంది. ఎస్‌హెచ్‌జీలు సాధార ణంగా అందరినీ కలుపుకునిపోతూ, రుణాలు ఇవ్వ డం, వసూళ్లు చేసుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. స్వయం సహాయక బృందాల ద్వారా పేదలు మరింతగా సంబంధాలు పెంచుకుంటూ, ఆర్థిక వనరులను మెరుగుపరచుకుంటూ ముందుకు వెళ్లడం దీని ప్రధానోద్దేశం. ప్రస్తుతం వ్యవస్థలన్నీ పేదల కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక సంక్షోభాలు తలెత్తినప్పుడే స్వయం సహాయక సంఘాలను ఆశ్ర యించడం జరుగుతోంది. అయితే, జీవితంలో పైపైకి ఎదగడానికి ఓ బంధంగా, పటిష్ఠంగా అభివృద్ధి చెందడం అవసరం.

image
 

 

 

(రచయిత కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి. ప్రత్యక్షంగా సమీక్షలు నిర్వహించిన వ్యక్తి. అభిప్రాయాలు వ్యక్తిగతం)

English Title
Poor polytheit!
Related News