మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా...

Updated By ManamSun, 07/22/2018 - 00:03
rajashekhar

హీరోగా చేసిన టైమ్ అయిపోయింది.. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించాల్సిందే అని అందరూ అనుకుంటున్న తరుణంలో imageప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘పిఎస్‌వి గరుడవేగ 126.18 ఎం’ సినిమాతో సక్సెస్ సాధించారు హీరో రాజశేఖర్. సక్సెస్ తర్వాత వెంటనే సినిమాలు చేసేయకుండా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు రాజశేఖర్.

  అందులో భాగంగా దర్శకుడు ప్రశాంత్‌వర్మతో ఓ సినిమా చేయబోతున్నారు. ‘అ!’ సినిమా తర్వాత  ప్రశాంత్‌వర్మ ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజశేఖర్‌తో ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడవుతాయి.

English Title
as a police officer again
Related News