పాయింట్ కొత్తదే. కానీ..

Updated By ManamSat, 11/03/2018 - 00:24
Naga Chaitanya

SAVYASACHIహీరో నాగచైతన్యకు ‘రారండోయ్ వేడుక చూద్దాం’ తర్వాత ఆశించిన విజయాలు దక్కలేదు. ప్రతి సినిమాలోనూ వైవిధ్యంతో కూడుకున్న కథ ఉండేలా చూసుకుంటున్నప్పటికీ ఇతర కారణాల వల్ల పరాజయాలు చవిచూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగచైతన్య. ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన చందు మొండేటి దర్శకత్వంలో చైతన్య చేసిన సినిమా ‘సవ్యసాచి’. వరుస విజయాలు సాధిస్తూ చిత్ర నిర్మాణ రంగంలో దూసుకెళ్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా కథాంశం ఏమిటి? ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుంది? అనే విషయాలు ‘మనం’ రివ్యూలో తెలుసుకుందాం.

ఈ సినిమా వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే పాయింట్‌ని బేస్ చేసుకొని తెరకెక్కించారు. హీరో పేరు విక్రమ్ ఆదిత్య (నాగచైతన్య) ఈ రెండు పేర్లూ ఒకరివే. పైన చెప్పుకున్న వ్యాధి కారణంగా ఒకే మనిషిలో రెండు రకాల కదలికలు ఉంటాయి. అతని ప్రమేయం లేకుండా ఎడమ చేయి కదులుతుంది. రకరకాల ఇబ్బందులు కలిగిస్తుంది. ఇదిలా ఉంటే విక్రమ్‌కి ఒక లవ్‌స్టోరీ ఉంది. ఆరేళ్ళ క్రితం లవ్ చేసుకోవ డం, విడిపోవడం కూడా జరిగిపోయింది. మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఇద్దరూ కలుసుకుంటారు. విక్రమ్ అక్క కూతురు మహాలక్ష్మి అంటే అతనికి ప్రాణం. ఒక ఘటన కారణంగా బావ చనిపోతాడు, అక్క గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంటుంది. చనిపోయిందనుకున్న మహాలక్ష్మి బ్రతికే ఉందని తెలుసుకుంటాడు విక్రమ్. మహాని అరుణ్(మాధవన్) అనే వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. ఆ పాపను అడ్డుపెట్టుకొని విక్రమ్‌తో ఆడుకుంటూ ఉంటాడు. విక్రమ్‌కి, అరుణ్‌కి మధ్య ఎలాంటి శత్రుత్వం ఉంది? పాపని ఎందుకు కిడ్నాప్ చేశాడు? అతన్నుంచి విక్రమ్ పాపని ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగతా కథ. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనేది కొత్త పాయింటే అయినప్పటికీ దానితో ఒక బలమైన కథను రాసుకోవడంలో చందు మొండేటి సక్సెస్ అవ్వలేదు. సినిమాలోని మెయిన్ పాయింట్‌ని వదిలేసి, అమ్మాయిని విలన్ కిడ్నాప్ చేయడం అనే కొత్త కథవైపు డైరెక్టర్ వెళ్ళాడో అప్పుడే సినిమా భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నిజానికి హీరోకి ఉన్న అవలక్షణంతో సినిమాలో కావాల్సి నంత కామెడీని పండించే అవకాశం ఉంది. అయినప్పటికీ రొటీన్‌గా కామెడీని చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఫస్ట్‌హాఫ్‌లో కమెడియన్స్ చేసిన కామెడీ ఫర్వాలేదు అనిపిస్తుం ది. నటీనటుల పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలం టే విక్రమ్ ఆదిత్య క్యారెక్టర్స్‌కి నాగచైతన్య పూర్తి న్యాయం చేసేందుకు ట్రై చేశాడు. డాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. విలన్‌గా నటించిన మాధవన్ తనదైన నటనతో మంచి మార్కులు తెచ్చుకున్నా డు. నిధి అగర్వాల్ కేవలం గ్లామర్‌కి, పాటలకు మాత్రమే పరిమితమైపోయింది. కథలో ఆమె పాత్ర ఉన్నప్పటికీ అది నామమాత్రంగానే ఉంది. వెన్నెల కిశోర్, సత్య, సుదర్శన్, షకలక శంకర్ చేసిన కామెడీ అక్కడక్కడ వర్కవుట్ అయింది. 

టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి చెప్పుకోవాలంటే యువరాజ్ అందించిన ఫోటోగ్రఫీ బాగుంది. పాటల్లో, యాక్షన్ సీక్వెన్స్‌లలో అతని కెమెరా పనితనం కనిపించింది. నాగ చైతన్య, నిధి అగర్వా ల్‌లను అందంగా చూపించడంలో అతను సక్సెస్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చేసిన పాటల్లో టైటిల్ సాంగ్, నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు రీమి క్స్ సాంగ్స్ ఆకట్టు కుంటాయి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కీరవాణి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సీన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల బాగా ఎలివేట్ అయ్యాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఫర్వాలేదు అనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌లో, సెకండాఫ్‌లో కుదించాల్సిన సీన్స్, తొలగించాల్సిన సీన్స్ చాలా ఉన్నాయి. అవి కూడా తగ్గించి ఉంటే సినిమా ఇంకా స్పీడ్ అయ్యేది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ గురించి చెప్పాలంటే ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్‌గా నిర్మించారు. ఇక డైరెక్టర్ చందు మొండేటి రాసుకున్న కథలో కొత్తదనం, ఎంచుకున్న పాయింట్‌లో కొత్తదనం ఉన్నప్పటికీ దాన్ని స్క్రీన్‌పై ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అవ్వలేకపోయాడు. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే పాయింట్‌తో సినిమా రూపొందింది అని యూనిట్ పదే పదే చెప్ప డంతో ఓ కొత్త తరహా సినిమా చూడబోతున్నామని ప్రేక్షకులు ఆశించారు. అయితే కొత్తది అనుకున్న పాయింట్‌ని పక్కన పెట్టేసి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోలాగే సందర్భం లేకుండా వచ్చే పాటలు, అనవసరమైన కామెడీ జోడించడం తో ‘సవ్యసాచి’ సాదా సీదా సినిమాగా మిగిలిపో యింది. ఇక సెకండాఫ్‌లో కథ ముందుకు నడవ కుండా కాలయాపన చేసేందుకు హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళడం, కాలేజీలో సుభద్ర పరిణయం పేరుతో ఓ నాటకాన్ని వేయడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. దాదాపు 15 నిమిషాల పాటు సాగే ఈ నాటకం ద్వారా కామెడీ పండు తుందనే ఆలోచన బెడిసి కొట్టింది. ఈ నాటకం తర్వాత ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయ తు’ రీమిక్స్ సాంగ్ హఠా త్తుగా రావడం ప్రేక్షకుల్ని కలవరపరి చింది. ఈ పాట చిత్రీకరణ మరీ నాసిరకంగా ఉంది. గత రెండు సినిమాలను ఎంతో పకడ్బందీగా తీసిన చందు ఈ సినిమా విషయంలో ఉదాసీనం గా వ్యవహరించారని అర్థమవుతుంది. ఈ సినిమా కి ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకో దగినవి ఫోటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టైటిల్ సాంగ్, రీమిక్స్ సాంగ్, అక్కడక్కడ నవ్వించిన కామెడీ. కథలోని మెయిన్ పాయింట్ ని పక్కన పెట్టేయడం, సిల్లీగా అనిపిం చే విలన్ ఫ్లాష్‌బ్యాక్, సెకండాఫ్‌లోని నా టకం సినిమాకి మైనస్‌పాయింట్స్ అయ్యా యి. హీరో, విలన్ మధ్య హోరా హోరీగా పోరాటం ఉంటుందని ఆడియన్స్ ఎక్స్‌పెక్టే షన్స్‌ని డైరెక్టర్ రీచ్ అవ్వలేకపోయారు. ఓ సాదా సీదా ఫైట్‌లో విలన్‌ని అంతమొందించ డంతో సినిమా ముగుస్తుంది. ఓవరాల్‌గా ఈ సినిమా ఒక వర్గం ఆడియన్స్‌ని కొంతవర కు ఆకట్టుకునే అవకాశం ఉంది. కథ, కథనంలో కొత్తదనం, థ్రిల్ చేసే ట్విస్టులు, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండాలని కోరుకునే కొంతమంది ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. 

English Title
Point is new. But ..
Related News