నీరవ్ చలవ.. పీఎన్‌బీకి భారీ నష్టాలు

Updated By ManamTue, 05/15/2018 - 18:54
PNB Shows Net Loss Worth Rs13400 cr Due to Nirav Modi Fraud
  • రూ.13,400 కోట్ల నికర నష్టం.. నాలుగో త్రైమాసిక ఫలితాల వెల్లడి

PNB Shows Net Loss Worth Rs13400 cr Due to Nirav Modi Fraud

న్యూఢిల్లీ: ఆ మధ్య కాలంలో నీరవ్ మోదీ కుంభకోణం నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) బాగా వార్తల్లో నిలిచింది. ఒకటా రెండా.. రూ.13 వేల కోట్ల మేర ఆ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టేశాడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ. అతడిని అరెస్ట్ చేసేందుకు ఇప్పటికీ భారత ప్రభుత్వం తంటాలు పడుతూనే ఉంది. ఆ విషయాన్ని పక్కనపెడితే.. తాజాగా పీఎన్‌బీ తన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. నీరవ్ మోదీ చలవో ఏమో గానీ నాలుగో త్రైమాసికంలో నష్టాలనే చూపించింది ఆ బ్యాంకు. నాలుగో త్రైమాసికంలో మార్చి 31 నాటికి రూ.13,416.91 కోట్ల నికర లాభాన్ని చూపించింది పీఎన్‌బీ. గత ఏడాది ఇదే సమయంలో 262 కోట్ల రూపాయల నికర లాభాన్ని చూపించిన బ్యాంకు.. ఈ ఏడాది నీరవ్ మోదీ పుణ్యమా అని దానికి 50 రెట్లకుపైగా నష్టాలను మూటగట్టుకుంది. మంగళవారం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది పీఎన్‌బీ. అయితే, ఫలితాలను ఇలా ప్రకటించిందో లేదో.. ఆ బ్యాంకు షేర్ల విలువ దాదాపు 6 శాతం పడిపోయింది. ఇక, బ్యాంకుకు సంబంధించినంత వరకు చెడురుణాల మార్చి నెలాఖరు నాటికి 18.38 శాతానికి పెరిగాయి. మూడు నెలల క్రితం 12.11 శాతం, ఏడాది క్రితం 12.53 శాతంగా ఉన్న చెడు రుణాలు ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి. ఇక, సోమవారానికి బ్యాంకు స్టాక్ 44 శాతం పడిపోయింది. బ్యాంక్ ఫ్రాడ్ జరిగిన దగ్గర్నుంచి దారుణంగా పీఎన్‌బీ స్టాక్ ప్రభావితమైంది. బ్యాంకింగ్ రంగంలో అత్యంత దారుణంగా దెబ్బతిన్న స్టాక్‌లు పీఎన్‌బీవే కావడం గమనార్హం. 

English Title
PNB Shows Net Loss Worth Rs13400 cr Due to Nirav Modi Fraud
Related News