కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు

Updated By ManamMon, 02/19/2018 - 18:45
Narendra Modi

Narendra Modiకాంగ్రెస్ పార్టీకి అధికారం తప్ప ప్రజల ఆకాంక్షలతో పనిలేదని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మైసూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం శీఘ్రాభివృద్ధి సాధించాలన్నది కర్ణాటక ప్రజల ఆకాంక్షగా పేర్కొన్నారు. అయితే వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కారు విఫలం చెందిందని విమర్శించారు. పర్యాటక కేంద్రమైన మైసూరు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. పర్యాటక కేంద్రంపై అతి తక్కువ పెట్టుబడి చేస్తే...ఎక్కువ ఉపాధి అవకాశాలు దక్కుతాయని స్పృహ ప్రభుత్వానికి లేకపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 

English Title
PM Modi Slams Karnataka Govt
Related News