భౌతికవాద సాహిత్య విమర్శకుడు

Updated By ManamMon, 10/08/2018 - 00:01
tripuraneni

tripuraneniఖచ్చితత్వం, ప్రామాణికత, హేతు ప్రదర్శన విమర్శలో కీలకం. ఈ పని చేయాలంటే సాహిత్యాన్ని మానవ ఆచరణగా, సామాజిక ఉత్పత్తిగా గుర్తించాలి. అప్పుడు ఒక రచన వల్ల కలిగే సృజనాత్మక ప్రేర ణలకు లోనవుతూనే వస్తుగతంగా దాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. అలాంటి విమర్శ తలాన్ని మధుసూదనరావు అత్యంత శక్తిమంతంగా నిర్మించారు. మార్క్సిస్టు సాహిత్య విమర్శను విప్లవాత్మకం చేసిన వాళ్లలో త్రిపురనేని మధుసూదనరావు ప్రముఖుడు. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల విప్లవ దృక్పథాన్ని ఆయన సాహిత్య విమర్శలోకి తీసు కొచ్చారు. స్థూలంగా ఒక వాచకాన్ని, లేదా ఒక రచయితను సామాజిక, రాజకీయార్థిక నేపథ్యం లో పరిశీలించడమే మార్క్సిస్టు సాహిత్య విమర్శ గా  గుర్తింపు పొందిన రోజుల్లో ఆయన ఈ రంగంలోకి వచ్చారు. సాహిత్యంలో విప్లవోద్యమ నిర్మాణం ఎలా ఉండాలనే ఆలోచనలు సాగుతున్న చారిత్రక సందర్భాన్ని ఆయన నూటికి నూరు శాతం అర్థం చేసుకున్నారు. అంటే సాహిత్య రం గంలో వర్గపోరాటం చేయాల్సిన అవసరాన్ని మధుసూదనరావు గుర్తించారు. దీనికి సాహిత్య విమర్శ సాధనంగా ఉండాలని ప్రతిపాదించారు. సాహిత్య విమర్శా తలాన్ని గుర్తించడం ఆయన ప్రత్యేకతలో ముఖ్యమైనది. రచయితలు కూడా ఒక రచన.. అది తమదైనా, ఇతరులదైనా సరే అందులోని మంచి చెడ్డలు చెప్పగలరు. ఈ శక్తి  పాఠకులకు కూడా ఉంటుంది. పఠనాను భవం దగ్గర మొదలు పెట్టి రచన ఎందుకు అలా ఉన్నదో, ఎలా ఉండాలో కూడా విశ్లేషించగలరు. ఆ రకంగా పాఠకులూ  విమర్శక పాత్ర పోషిస్తా రు. అయితే విమర్శకులు అంతకంటే భిన్నమైన తలంలో రచనను, రచయితను పరిశీలిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే శాస్త్రీయ తలంలో విమర్శ సాగుతుంది. విమర్శకులకు కూడా అభి రుచులు ఉండవచ్చు.

వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ఉం డవచ్చు. మౌలికంగా సృజనాత్మక రూపం కాబ ట్టి  సాహిత్యం అలాంటి అనుభూతులకు విమర్శ కులను కూడా లోను చేస్తుంది. తాను పరిశీలి స్తున్న అంశం సాహిత్యమనే విషయంలో ఏ మా త్రం ఏమరపాటు లేకుండా ఒక సామాజిక శాస్త్ర వేత్త వలె రచనను పరిశీలించాల్సి ఉంటుంది. ఖచ్చితత్వం, ప్రామాణికత, హేతు ప్రదర్శన విమర్శలో కీలకం. ఈ పని చేయాలంటే సాహిత్యాన్ని మానవ ఆచరణగా, సామాజిక ఉత్పత్తిగా గుర్తించాలి. అప్పుడు ఒక రచన వల్ల కలిగే సృజనాత్మక ప్రేర ణలకు లోనవుతూనే వస్తుగతంగా దాన్ని అంచ నా వేయాల్సి ఉంటుంది. అలాంటి విమర్శ త లాన్ని మధుసూదనరావు అత్యంత శక్తివంతంగా నిర్మించారు. ఇందులో ఆయన వ్యక్తిగత ప్రతిభ కూడా ఉన్నమాట వాస్తవమే కాని, విప్లవోద్యమ పంథా చాలా ప్రధానంగా పని చేసింది. 

విప్లవోద్యమం కోసం సాహిత్య విమర్శ రం గాన్ని తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యం పెట్టుకొని ఆయ న బయల్దేరాడు. అందుకే ఆయన తనను తాను మావోయిస్టు సాంస్కృతిక కార్యకర్తగా చెప్పుకొనే వారు. అట్లని ఆయన సాహిత్యాన్ని, విమర్శను కేవలం విప్లవోద్యమ ప్రచార పనిముట్లుగా భా వించలేదు. అదే నిజమైతే ఆయన కృషి ఇంతగా నిలిచిపోయేది కాదు. సాహిత్య సిద్ధాంతం, విమర్శకు ఆయన చేసిన దోహదాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ రెంటినీ ఆయన ఎలా చూశారనేది చాలా ముఖ్యం. సా హిత్యాన్ని నిర్దిష్ట సామాజిక, చారిత్రక చట్రంలో భాగంగా చూస్తూనే మానవ జీవితంలో ఉండే స్థానాన్ని పట్టించుకున్నారు. స్థలకాలబద్ధమైన మానవ జీవితంలో అవిభాజ్యంగా కళా సాహి త్యాలు ఉంటాయనే ప్రతిపాదించారు. బహుశా అంతక ముందు మార్క్సిస్టు విమర్శకుని కంటే కూడా ఆయన  ఈ విషయంలో చాలా సునిశిత పరిశీలకుడు. జానపదాల దగ్గరి నుంచి, మధ్య యుగాల కావ్యాల దాకా, వర్తమాన సాహిత్యం దాకా ఆయన చేసిన పరిశీలనకు ఇదే పునాది. 

అంటే చారిత్రక భౌతికవాద పద్ధతిని సాహి త్యమనే మానవ చైతన్య రూపానికి ఎలా అన్వ యించాలో మధుసూదనరావు ఒక పద్ధతిని అం దించారు. అందువల్ల చారిత్రక భౌతిక వాదం వెలుగులో సాహిత్యాన్ని పరిశీలిస్తున్న దశ నుంచి మార్క్సిస్టు విమర్శను ఆయన చాలా ఉన్నత స్థితికి తీసికెళ్లారు. ఈ పని అంతా నడుస్తున్న విప్లవోద్యమ సాహిత్య అవసరాలు తీర్చే క్రమం లోనే చేశారు. ఆ రోజుల్లో విప్లవోద్యమాన్ని వ్యతి రేకిస్తున్న రివిజనిస్టు విమర్శకులను, మార్క్సిస్టు ముసుగు తగిలించుకున్న మేధావులను, శుష్క మానవతావాద రచయితలను, రూపవాదం దా పున గొప్ప సృజనాత్మక రచయితలుగా ప్రచార మవుతున్న వాళ్లను, వీళ్లందరికంటే ప్రమాద కరమైన సంప్రదాయ పునరుద్ధరణవాదులను, అందులో కూడా కొత్త వేషం కట్టి వచ్చిన నవ్య సంప్రదాయ వాదులను.. ఒకరనేమిటి? ఎక్కడె క్కడి నుంచి విప్లవ వ్యతిరేకులు పుట్టకొస్తున్నారో గుర్తించి వాళ్లపైకి దండయాత్ర సాగించారు. వాళ్లతో సాగిన వాదోపవాదాల్లో సకల ప్రతిఘా తుక భావజాలాలను, రాజకీయాలను ఓడించ డం ద్వారా నక్సల్బరీ రాజకీయాలను  సాహిత్య రంగంలో సుస్థిరం చేశారు. ఇదంతా తక్షణ అవసరాల కోసం, వ్యూహా త్మకంగానే చేయలేదు. ఈ మొత్తంలో సాహి త్యం, సాహిత్య విమర్శ స్వభావం గుర్తెరిగి, దాని కి దీర్ఘకాలికంగా ఉపయోగపడే సాహిత్య సిద్ధాం త నిర్మాణ ప్రయత్నం చేశారు. తక్షణ, దీర్ఘకాలిక ప్రయోజనాలను రెంటినీ మార్క్సిస్టు సాహిత్య సి ద్ధాంత కల్పన అనే పునాది మీద అత్యంత మెల కువగా సాధించారు. ఇప్పుడు ఆయన రచనలు వరుసగా చదువుతోంటే ఈ వ్యూహం అన్ని దశ ల్లో ఎంత పకడ్బందీగా అనుసరించిందీ తెలు స్తుంది. తొలి వ్యాస సంకలనం కవిత్వంచైతన్యం దగ్గరి నుంచి చివరి దాకా రాసిన అన్ని ప్రధాన రచనల్లో ఇది ఉంది. 
గతితార్కిక సాహిత్య భౌతికవాదం అనే ప్రతిపాదన ఈ ఎరుక నుంచి వచ్చిందే. దీనిపై అటూ ఇటూ చాలా విస్తృతమైన చర్చ జరిగింది. ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్లలేం కాని, మార్క్సి స్టులు సాహిత్యాన్ని ఎలా చూడాలి? సాహిత్యం కూడా సామాజిక ఉత్పత్తి అయినప్పుడు  దానికి చారిత్రక భౌతికవాదాన్ని ఎలా అన్వయించి సాహిత్య సిద్ధాంతం తయారు చేయాల్సి ఉం టుంది? అనే లక్ష్యం దిశగా ఈ ప్రతిపాదనను చూడవచ్చు. ప్రపంచ విప్లవోద్యమ ఆచరణ లోంచి రూపొందిన మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, మావోల రచనలను గీటురాయిగా పెట్టుకొని సాహిత్య సిద్ధాంతానికి సొంత దారి వేసుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఆయన మనకున్న మార్క్సిస్టు సాహిత్య విమర్శకుల్లో ఒరిజినల్ థింకర్‌గా కనిపిస్తారు. 

విశ్వనాథ సాహిత్యంపై ఆయన కంటే ముందు కూడా విశ్లేషణలు వచ్చాయి. కానీ మధు సూదనరావు విశ్వనాథ నవలా సాహిత్యంతో సహా అన్నిటినీ పైన చెప్పిన పద్ధతిలో పరిశీలిం చారు. ముఖ్యంగా ఆయనకు తాత్విక రంగంలో ఉన్నపట్టు వల్ల విశ్వనాథలోని సనాతన బ్రాహ్మ ణ భావనలను తూర్పారపట్టారు. సారాంశంలో విశ్వనాథ గోల్వాల్కర్ తమ్ముడని తేల్చేశారు. నిజానికి ఇప్పుడున్న వాతావరణంలో మధు సూదనరావు విశ్లేషణ పద్ధతికి, దృక్పధానికి చాలా ప్రాధాన్యత ఉంది. సనాతన భావజా లాన్ని అనేక వైపుల నుంచి, వేర్వేరు సందర్భాల్లో ఆయన రాసిన రచనలు ఇప్పుడు మరోసారి చదువుకోవడం చాలా అవసరం. సాహిత్య బ్రా హ్మణ్యాన్ని ఛేదించకపోతే మన దేశంలో ప్రగతి శీల, విప్లవ సాహిత్యానికి చోటు దొరకదని ఆయ న చాలా ముందుగా గుర్తించారు. ఆయనే చెప్పు కున్నట్లు రివిజనిస్టు, భూస్వామ్య సాహిత్యకా రులను, వాళ్ల సిద్ధాంతాలను, భావజాలాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పని చేశారు. ఇందులో ఆయన చేసిన ఒక మహత్తర కృషి ఉంది. మార్క్సిస్టు సాహిత్య విమర్శను, సిద్ధాం తాన్ని అభివృద్ధి చేయడం, సాహిత్యంలోని ప్రతి ఘాతుక బ్రాహ్మణ, భూస్వామ్య శక్తులను ఎదు ర్కోవడం అనే కర్తవ్యానికి ఆయన సంస్కృత అలంకారశాస్త్రాలపై దాడితో ఒక పునాదిని ఏర్ప రుచుకున్నారు. అంతక ముందున్న మార్క్సిస్టు సాహిత్య విమర్శకులు కూడా ఈ పని కొంత చేశారు. కానీ సాహిత్యాన్ని భౌతికవాద దృష్టితో చూడాలన్నా, మానవ జీవితంలో సాహిత్యానికి ఉండే వాస్తవ పాత్రను అర్థం చేసుకోవాలన్నా, ఆస్థానేతర, అవైదిక ప్రజా సాహిత్యాన్ని గుర్తించి వాటిలోని సాహిత్య సామాజికతను విశ్లేషించా లన్నా మొట్ట మొదట అలంకారశాస్త్రాలను పాత ర పెట్టాలని ఆయన బయల్దేరాడు. విప్లవ సాహి త్యోద్యమానికి, విప్లవోద్యమానికి, మార్క్సిస్టు సాహిత్య విమర్శ రంగానికి మధుసూదనరావు ఏం చేశారనే గంభీరమైన విషయాల దగ్గరికి పోకుండానే చాలా మామూలు ప్రగతిశీల దృష్టి తో చూసినా అలంకార శాస్త్రాలను పూర్వపక్షం  చేయడం ద్వారా తెలుగు సాహిత్యరంగానికి ఆయన అద్భుతమైన కృషిగా కనిపిస్తుంది. నిజానికి అలంకారశాస్త్రాల ప్రభావం అప్ప టికీ, ఇప్పటికీ కొందరు మార్క్సిస్టు సాహిత్య విమర్శకులనబడే వాళ్ల మీద కూడా ఉన్నది.

ఆధునికానంతర వాదులుగా చెలామణి అయ్యే వాళ్లూ అలంకార శాస్త్రాల మీద మురిపం వదు లుకోవడం లేదు. అయితే మధుసూదనరావు కృషి ఎలాంటిదంటే ఇప్పటికీ ఎవరైనా అలంకార శాస్త్రాలను మోసుకతిరగవచ్చుగాక... వాటికి, వాళ్లకు ఎలాంటి గౌరవమూ లేని స్థితి కల్పిం చారు. సాహిత్యానికి సమగ్రమైన మార్క్సిస్టు సిద్ధాంతం ఇంకా తయారు కాకపోవచ్చు, ఆ రకంగా ఇంకా చేయవలసిన కృషి ఎంతో ఉండ వచ్చు. కానీ సనాతన సంస్కృత సాహిత్య సిద్ధాం తాల బంధనాల నుంచి తెలుగు విమర్శను ఆయన బైటికి తీసుకొని వచ్చారు. ఈ దిశగా ఆయనను నడిపించిన శక్తి విప్ల వోద్యమం. భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరా టాల ఎజెండాతో నక్సల్బరీ వచ్చింది. రివిజనిస్టు సంకెళ్ల నుంచి కమ్యూనిస్టు ఉద్యమాన్ని విముక్తి చేసింది. ఆ కాలం సాహిత్య రంగంలో మధుసూ దన రావును రూపొందించింది. తన కంఠస్వ రాన్ని విప్లవోద్యమం ఆయన రచనలో, ప్రసం గంలో ప్రతిఫలించింది. అచ్చమైన  మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఎలా ఉండాలో  వర్గపోరాటం  ఆయన ద్వారా నిర్మించుకుంది. భౌతిక స్థల కాలాలు, మానవ చైతన్య ఆచరణల మధ్య త యారైన ఆలోచనాపరుడు ఆయన. ఒక్క మాట లో చెప్పాలంటే నక్సల్బరీ రూపొందించుకున్న మేధావి త్రిపురనేని మధుసూదనరావు.   
 పాణి విరసం
(నేడు మధుసూదనరావు వర్థంతి)

English Title
Physical literary critic
Related News