కిడారి శ్రవణ్, ఫరూక్‌కు సీఎంఓ నుంచి ఫోన్

Updated By ManamFri, 11/09/2018 - 18:18
Kidari Sravan, Faruqh, CMO, AP cabinet extension, Chandrababu naidu

Kidari Sravan, Faruqh, CMO, AP cabinet extension, Chandrababu naiduఅమరావతి: మావోయిస్టులు హతమార్చిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్, ఏపీ శాసనమండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్‌కు ఏపీ సీఎంఓ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు సమాచారం అందింది. ఏపీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మైనార్టీ, ఎస్టీ విభాగంలో వీరిద్దరికి చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎంఓ నుంచి వచ్చిన ఫోన్ కాల్‌లో కిడారి శ్రవణ్, ఫరూక్‌ను కేబినెట్‌లో తీసుకుంటున్నట్టుగా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.

కిడారి శ్రవణ్.. వారణాసి ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని, ప్రస్తుతం సివిల్స్‌కి శ్రవణ్ ప్రిపేర్ అవుతున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ నెల 11న ఏపీ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఏపీ కేబినెట్‌లో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను సీఎం చంద్రబాబు భర్తీ చేయనున్నారు. మరోవైపు కేబినెట్‌లో పలు శాఖల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకోనే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 

English Title
Phone call from CMO to Faruqh, Kidari Sravan
Related News