ఫెదరర్ ఔట్

Updated By ManamThu, 07/12/2018 - 00:10
FEDARAR
  • అల్లాడించి ఓడించిన అండర్సన్

imageలండన్ః వింబుల్డన్‌లో పెను సంచలనం నమోైదెంది.  టాప్ సీడ్, వరల్డ్ నంబర్ టూ రోజర్ ఫెదరర్‌కు ఊహించని రీతిలో ఓటమి ఎదురైంది. ద క్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ అండర్స్‌న్ చేతిలో గ్రాస్‌కోర్ట్ కింగ్ ఫెదరర్ 6-2, 7-6(7-5),5-7,4-6,11-13 చిత్తయిపోయాడు.  నువ్వానేనా అన్నట్టు  నాలుగుగంటలు పైగా  సాగిన ఈ మ్యాచ్‌లో  ఫెదరర్ తొలి సెట్‌ను సునాయాసంగానే గెలుచుకున్నా.. ఆ తర్వాత అండర్సన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది.

చివరి సెట్ వరకూ ఫెదరర్‌కు చెమటలు పట్టించిన అండర్సన్ చివరకు విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టాడు.మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో  సెర్బియా స్టార్, మాజీ చాంపియన్ నోవాక్ జకోవిచ్ వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో సెమీస్‌లోకి అడుగుపెట్డాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 12వ సీడ్ జకోవిచ్ (సెర్బియా) 6-3, 3-6, 6-2, 6-2తో జపాన్‌కు చెందిన 24వ సీడ్ నిషికొరిని చిత్తుచేసి దర్జాగా సెమీస్‌కు దూసుకెళ్లాడు.

English Title
ఫెదరర్ ఔట్
Related News