పాక్ ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడి

Updated By ManamWed, 07/11/2018 - 11:52
Haroon Ahmed Bilour
  • పెషావర్ ఆత్మాహుతి దాడిలో 20మంది మృతి

Peshawar suicide attack

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఎన్నికల ప్రచారంలో దాడులు జరగవచ్చన్న నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం అథారిటీ (నాక్టా) హెచ్చరికలు నిజమయ్యాయి. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడి 20 మంది మృతి చెందగా, సుమారు 30మందికిపైగా గాయపడ్డడారు. కాగా పెషావర్‌లో అవామీ నేషనల్‌ పార్టీ (ఏఎన్‌పీ) ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ర్యాలీలో పాల్గొన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

కాగా మృతుల్లో ఏఎన్‌పీ అభ్యర్థి హరూన్‌ బిలౌర్‌ ఉన్నారు. పాకిస్తాన్‌లో ఈ నెల 25న సార్వత్రిక ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల బరిలో హరూన్‌ కూడా ఉన్నారు. ఆయన ప్రసంగం ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే ఆత్మాహుతి దాడి జరిగింది. కాగా ఈ దాడికి తామే బాధ్యులమని  పాక్ తాలిబాన్లు ప్రకటించారు. 

మరోవైపు ఈ దాడి ఘటనను పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌​ చీఫ్‌, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా ఖండించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇమ్రాన్ ట్వీట్ చేశారు. అలాగే ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న జాబితాలో ఇమ్రాన్‌‌తో పాటు అవామీ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు అఫ్సన్‌దర్‌ వలి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్‌ సయీద్‌ కుమారుడు కూడా ఉన్నారు.

English Title
Peshawar suicide attack: Haroon Ahmed Bilour among 20 killed in Pakistan
Related News