గోదావరిపై జనసంద్రం

Updated By ManamWed, 06/13/2018 - 00:56
people rush on  on Godavari
  • తూర్పు గోదావరిలోకి ప్రజాసంకల్పయాత్ర.. జనంతో కిక్కిరిసిన రాజమహేంద్రవరం బ్రిడ్జి

  • నదిలో 600 పడవలతో జగన్‌కు స్వాగతం.. జన్మలో దీన్ని మరువలేనన్న వైసీపీ అధినేత

imageకొవ్వూరు/జంగారెడ్డిగూడెం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర అశేష జనవాహిని మధ్య మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ 187వ రోజున కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం రోడ్డు కమ్ రైల్ మీదుగా తూర్పులోకి అడుగిడింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవు ఉన్న వంతెన మొదలు నుంచి చివరి వరకు జనంతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది వైసీపీ కార్యకర్తలు, ప్రజలు వెంట సాగి... జగన్‌కు ఘన స్వాగతం పలికారు. మరోవైపు ఈ బ్రిడ్జిని వైఎస్సార్‌సీపీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో కార్యకర్తలు అలంకరించారు. వేలాది జనంతో బ్రిడ్జిపైన కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వరకూ జగన్ వెంట నడవగా.. కింద గోదావరిలో ఒక వైపున పార్టీ జెండాలతో అలంకరించిన 600 పడవలు స్వాగతం పలికాయి. బ్రిడ్జికి మరోవైపున రెయిలింగ్‌కు ఏడు అడుగుల ఎత్తు, 3.5 కిలోమీటర్ల మేర భారీ పార్టీ జెండా కట్టారు. జెండాలోని మూడు రంగులతో కూడిన చీరలతో 150 మంది మహిళలు గుమ్మడికాయలతో జగన్‌కు హారతి ఇచ్చారు. ఇందుకోసం రాజమహేంద్రవరం వద్ద బ్రిడ్జి ప్రారంభంలో కోటిపల్లి బస్టాండ్ ప్రాంతంలో మూడంచెల వేదిక ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చి తూర్పు గోదావరి జిల్లాలోకి తనకు ఇంతటి ఘన స్వాగతాన్ని పలకడాన్ని ఈ జన్మలో మరచిపోలేనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

తొమ్మిది జిల్లాల్లో 2300కి.మీ. పూర్తి
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ గత ఏడాది నవంబరు 6న ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో 2300 కిలోమీటర్ల దూరం పూర్తయింది. కడప జిల్లా పులివెందులలో మొదలైన పాదయాత్ర 187వ రోజైన మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించడంతో పదో జిల్లాలోకి చేరింది. ఇక మరో మూడు జిల్లాల్లో మాత్రమే పాదయాత్ర మిగిలి ఉంది. గత ఏడాది నవంబరు 6న ఇడుపులపాయలో మొదలైన జగన్ యాత్ర అదే నెల 14న కర్నూలు జిల్లాలో 10image0 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. కర్నూలు జిల్లాలోనే 200, 300 కిలోమీటర్ల మైలురాళ్లను ఆయన దాటారు. ఇక అనంతపురం జిల్లాలో 600 కిలోమీటర్ల వరకు, చిత్తూరు జిల్లాలో 900 కిలోమీటర్ల మైలురాయి వరకు జగన్ పాదయాత్ర చేరింది. వెయ్యి కిలోమీటర్లను నెల్లూరు జిల్లా సైదాపురంలో పూర్తి చేసుకుని.. పైలాన్‌ను ఆవిష్కరించారు. 1100 కిలోమీటర్లను నెల్లూరులోని కలిగిరిలో దాటారు. 1200, 1300, 1400 కిలోమీటర్ల మైలురాళ్లను జగన్ ప్రకాశం జిల్లాలో అధిగమించారు. గుంటూరు జిల్లా 1700 కిలోమీటర్ల వరకు పాదయాత్ర సాగింది. ఇక కృష్ణా జిల్లాలో 1900 కిలోమీటర్ల మైలురాయిని దాటి.. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని నందమూరు క్రాస్ రోడ్డు వద్ద సోమవారం 2300 కిలోమీటర్లను దాటారు. ప్రతి వంద కిలోమీటర్లకు ఓ చోట పాదయాత్రకు గుర్తుగా జగన్ ఒక మొక్కను నాటుతూ వచ్చారు. పశ్చిమలో దాదాపు 30 రోజుల పాటు సాగిన ఆయన పాదయాత్ర మంగ ళవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో సాగుతుంది.

గోష్పాద క్షేత్రంలో ప్రత్యేక పూజలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగ ళవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆధ్వర్యంలో ఆయన గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పంచె కట్టులో పూజలు చేసిన ఆయన అనంతరం.. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య గోదావరమ్మకు హారతి ఇచ్చారు. ఆ తర్వాత వేద పండితులు వైఎస్ జగన్‌ను ఆశీర్వదించారు. ఆయనతోపాటు పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, జిల్లా నేతలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

English Title
people rush on on Godavari
Related News