పెన్షన్ పెంచే యోచన

Updated By ManamTue, 06/12/2018 - 22:50
atal-pension-yojana

atal-pension-yojanaన్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన (ఎ.పి.వై) కింద పెన్షన్ పరిమితిని ఇప్పుడున్న శ్లాబ్ రూ. 5,000 నుంచి రూ. 10,000లకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఎ.పి.వై కింద ఇచ్చే పెన్షన్ విలువను పెంచాల్సిన అవసరం ఉందని ఫైనాన్షియల్ సర్వీసుల శాఖ సంయుక్త కార్యదర్శి మదనేశ్ కుమార్ మిశ్రా ఇక్కడ పి.ఎఫ్.ఆర్.డి.ఎ నిర్వహించిన ఒక సమావేశంలో చెప్పారు. పెన్షన్ విలువను నెలకు రూ. 10,000 వరకు పెంచాలని కోరుతూ పి.ఎఫ్.ఆర్.డి.ఎ పంపిన ప్రతిపాదనను మేం చూశాం. అది మా క్రియాశీల పరిశీలనలో ఉంది’’ అని ఆయన మీడియా ప్రతినిధులతో విడిగా మాట్లాడుతూ చెప్పారు. ఎ.పి.వై చందాదారుల పునాదిని పెంచే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపినట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పి.ఎఫ్.ఆర్.డి.ఎ ) చైర్మన్ హేమంత్ జి. కాంట్రాక్టర్ తెలిపారు. ‘‘నెలకి రూ. 1000 నుంచి రూ. 5000 వరకు ప్రస్తుతం మావద్ద ఐదు శ్లాబ్‌లు ఉన్నాయి. హెచ్చు పెన్షన్ మొత్తాలు కోరుతూ మార్కెట్ నుంచి మాకు చాలా ఫీడ్‌బ్యాక్ వస్తోంది. ఇప్పటి నుంచి 20-30 ఏళ్ళ తర్వాత, 60 ఏళ్ళ వయసులో వచ్చే రూ. 5000 సరిపోవని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. దాన్ని రూ. 10,000 చేయాలనే ప్రతిపాదనను మేం ప్రభుత్వానికి నివేదించాం’’ అని కాంట్రాక్టర్ చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకి పి.ఎఫ్.ఆర్.డి.ఎ మరో రెండు ప్రతిపాదనలు కూడా పంపింది. ఎ.పి.వైకి ఆటో ఎన్‌రోల్‌మెంట్ కల్పించడం, పథకంలో ప్రవేశించడానికి గరిష్ఠ వయసు పరిమితిని 50 ఏళ్ళకు పెంచడం వా టిలో ఉన్నాయి. ప్రస్తుతం 18 నుంచి 40 ఏళ్ళ వయసువారు మాత్రమే ఎ. పి.వైలో ప్రవేశించే అవకాశం ఉంది. కానీ, దాన్ని మరో 10 ఏళ్ళకు (18- 50 ఏళ్ళ వయసువారికి) పెంచడం వల్ల చందాదారుల పునాది విస్తృతమవుతుంది. ఇప్పుడు ఎ.పి.వైలో 1.02 కోట్ల మంది చందాదారులున్నారు. ఈ పథకం కింద 2017-18లో పి.ఎఫ్.ఆర్.డి.ఎ సుమారు 50 లక్షల మం ది కొత్త చందాదారులను చేర్చుకోగలిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 60-70 లక్షల మంది చేరగలరని ఆశిస్తున్నట్లు కాంట్రాక్టర్ తెలిపారు. 

English Title
Pension enhancement
Related News