అవసరానికి మించి భూసేకరణ: పవన్‌

Updated By ManamSun, 07/22/2018 - 13:38
pawan kalyan
pawan
  • రైతుల్ని ఏడిపించినవారు నాశనం అవుతారు..

  • ప్రభుత్వాలు భూదాహం తగ్గించుకోవాలి

అమరావతి : చంద్రబాబు నాయుడు సర్కార్‌పై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మరోసారి విరుచుకుపడ్డారు. రాజధాని నిర్మాణం పేరుతో అవసరానికి మించి భూసేకరణ జరుగుతుందని ఆరోపించారు. పవన్‌ ఆదివారం ఉండవల్లిలో రైతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ...‘భూసేకరణ చేస్తారని ఎన్నికలకు ముందు తెలిస్తే నేనే వేరేలా ఉండేవాడ్ని. అభివృద్ధికి వ్యతిరేకం అని తెలిస్తే టీడీపీకి మద్దతు ఇచ్చేవాడిని కాదు. భూసేకరణ చేస్తే ఎదురు తిరగండి. 

భూసేకరణ జరిగితే చెప్పండి. మీతో కలిసి ఆందోళన చేస్తా. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ప్రాణాలు ఇవ్వడానికి ముందుంటా. అవసరానికి మించి భూములు తీసుకుంటే జనసేన ముందుండి పోరాటం చేస్తుంది. పంట భూముల్ని బీడు భూములుగా చూపడం సరికాదు. పోలీసులు, అధికారులను నెగిటివ్‌గా చూడొద్దు.  వాళ్లు ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసేవారు మాత్రమే.

 కొందరు చావులు, ఏడుపులతో రాజధాని వద్దు. రైతులు అభివృద్ధికి ఆటంకం కావద్దు, రైతుల్ని ఏడిపిస్తే నాశనం అవుతారు. ప్రభుత్వాలు భూదాహాన్ని తగ్గించుకోవాలి. సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్లడాన్ని జనసేన సహించదు. రాజ్యాంగం అందరికి సమానం. ఎవరు ఎవరికీ బానిసలు కాదు’ అని అన్నారు.

English Title
Pawan Kalyan Takes on chandrababu naidu government
Related News