గట్టుకో న్యాయం.. చెట్టుకో న్యాయమా..?

Updated By ManamWed, 05/16/2018 - 13:23
pawan, babu

pawan, babu చిత్తూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ శెట్టిపల్లిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ భూనిర్వాసితులతో సమావేశమైన పవన్, వారి సమస్యలను విన్నారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం గ్రామాల మధ్య వివక్ష చూపుతోందని విమర్శించారు. టీడీపీకి మద్దతిచ్చిన గ్రామానికి కూడా న్యాయం చేయకపోతే ఏం చేస్తామని ఆయన ప్రశ్నించారు. ఓటు వేసినవారే ఎదురుతిరుగుతున్నారని, ఈ విషయాన్ని టీడీపీ గుర్తించాలని పేర్కొన్నారు. 

రైతులకు అండగా ఉండారనే అప్పుడు టీడీపీకి మద్దతిచ్చామని, కానీ ఇప్పుడు రైతుల పక్షాన నిలబడనప్పుడు తాము కూడా మద్దతివ్వమని పేర్కొన్నారు. అమరావతి నుంచి శెట్టిపల్లి భూముల వరకు గట్టుకో న్యాయం.. చెట్టుకో న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని, దోపిడి జరుగుతుంటే మౌనంగా కూర్చునే రోజులు పోయాయని పవన్ అన్నారు. వేలకోట్లు దోచుకునే తెలివితేటలు ఉన్న మీకు 600 ఎకరాల్ని కాపాడే తెలివి తేటలు ఎందుకు లేవంటూ పవన్ ప్రశ్నించారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో విజయనగరం, శ్రీకాళహస్తిలో రోడ్డు విస్తరణ పరిహారం చెల్లించారు, కానీ ఇక్కడ ఎందుకు చెల్లించేదని, మీకు అనుకూలంగా ఉండి ఓట్లు వేస్తేనే న్యాయం చేస్తారా? అంటూ పవన్ అడిగారు.

 

English Title
Pawan Kalyan fire on Chandrababu Naidu 
Related News