మీకూ అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, కోడళ్లు ఉన్నారు

Updated By ManamFri, 04/20/2018 - 19:01
Pawan calls for telugu film industry meeting
  • వాళ్ల ఇంట్లోని ఆడవాళ్లు కూడా క్షేమంగా ఉండాలనుకుంటున్నా: పవన్

Pawan calls for telugu film industry meetingహైదరాబాద్: తనపై ఆరోపణలు చేస్తున్న, చేయిస్తున్న వారికీ అమ్మలు, అక్కలు, కోడళ్లు, చెల్లెళ్లు ఉన్నారని, వాళ్ల ఇంట్లోని ఆడవాళ్లు కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని జనసేనాధిపతి పవన్ కల్యాణ్ అన్నారు. మహిళల గౌరవానికి భంగం వాటిల్లే కథనాలపై సినీ పెద్దలు ఏం చేస్తున్నారని జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్టులు ఒక్కతాటిపైకి వచ్చి చిత్రసీమలోని మహిళల ఆత్మాభిమానం కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయా సమస్యలపై చర్చించేందుకు శనివారం తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశమవుతుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కాగా, సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపైన తెలంగాణ ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. శనివారం సినీ పరిశ్రమలోని ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులతో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ కాబోతున్నారు. సచివాలయంలో దీనిపై సమావేశం నిర్వహించబోతున్నారు. 

English Title
Pawan calls for telugu film industry meeting
Related News