నాణ్యమైన విద్యలో తల్లిదండ్రుల పాత్ర

Updated By ManamMon, 10/08/2018 - 00:01
study

studyపాఠశాలల్లో పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు, ఎలా నేర్చు కుంటున్నారు అనే విషయాల్ని తల్లిదండ్రులు అనుక్షణం గమ నించాలి.  కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలు పాఠశాల కు వెళ్లడం, రావడం మాత్రమే తెలుస్తుంది.  కానీ వీరికి  పిల్ల లు ఏమి నేర్చుకుంటున్నారు అనేది గమనించే సమయం, తీరి క ఉండదు. తల్లిదండ్రులందరు ఈ 10 ప్రశ్నలకు సమాధా నా లు తెలిసి ఉండాలి అని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లోని మాథ్యూ స్టీవెన్‌బెర్గ్ ఆధ్వర్యంలోని రీసెర్చ్ టీం జరిపిన పరిశోధనలో విద్యా మానసిక శాస్త్రంలోని రోర్షాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ ద్వారా వచ్చిన ఫలితాలు తెలిపారు. వాటిలో ముఖ్యంగా:
1. బాబు లేదా పాప ఏ పాఠ్యాంశాన్ని చక్కగా చదవ గలుగుతున్నారు?
2.పాఠశాలల్లో బోధించే పాఠ్యాంశాన్ని పునశ్చరణ చేస్తున్నా రా?
3. పాఠశాలల్లో ఎంత సమయం అసెంబ్లీ నిర్వహణకు, ఇతర కార్యక్రమాలకు  కేటాయిస్తున్నారు?
4. పిల్లలు ఏ రోజైనా పాఠశాలల్లో ఏడ్వడం  జరిగిందా? అలా జరిగితే ఎందువల్ల జరిగింది?
5. మా పిల్లలు పాఠ్యాంశంలోని ఏ అంశంపై శ్రద్ధ చూపిస్తున్నారు?
6. ఈ మాసంలో ఏ ఏ పరీక్షలు పాఠశాలలో నిర్వ హించారు?  నిర్వహిస్తే మన పిల్లల ఫలితాలు ఎలా ఉన్నాయి?
7. పాఠశాలలో పిల్లలకు ఏదైనా సమస్య ఎదురయిందా? అలా ఎదురైతే సమస్య పరిష్కారానికి  ఏమైనా కృషి చేశామా?
8. రోజులో ఎంత సమయం పిల్లల విద్యపై కేటాయించ గలుగుతున్నాను?
9. మా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యను ఉపాధ్యా యుల దృష్టికి తెచ్చినప్పుడు ఎంత తక్కువ సమయంలో దానిని పరిష్కరించగలిగారు?
10. నేను మా పిల్లలకు ఏ విధంగా సహాయపడి వారి విద్యాభివృద్ధికి తోడ్పడగలను? చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలలో చేర్పించిన తరువాత పాఠశాల వైపు కూడా చూడరు. పాఠశాలకు పోకపోయినప్పటికీ ఈ 10 ప్రశ్న లకు తల్లిదండ్రులు సమాధానాలు తెలుసుకోవలసిన అవస రం ఎంతైనా ఉంది. 

తల్లిదండ్రులు వారి పిల్లలకు సరైన విద్య ఆ పాఠశాలల్లో అందుతుందా? లేదా? సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారా? ఉపాధ్యాయులు వారు బోధించే అంశంపై సరైన అవగాహన కలిగి ఉన్నారా? లేదా? అనే విషయాన్ని గమనిం చాలి. పాఠశాల సమయంలో ఎక్కువ సమయం విద్యార్థుల ప రీక్షల నిర్వహణ, ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణకు ఉపాధ్యాయులకు సమయం సరిపోతుంది. ఉపాధ్యాయులు కూడా ఎంత సమయం తమ విద్యార్థుల కొరకు కేటాయిస్తు న్నామో గమనించాలి. విద్యాభివృద్ధికి శ్రద్ధ తీసుకోవాలి. ఉపాధ్యాయులు పూర్తి సమయం విద్యాబోధనకు కేటాయించలేని పరిస్థితి ఉంటుంది. వీటిని అధిగమించవలసిన అవసరం ఎం తైనా ఉంది. పైన తెలిపిన ప్రశ్నలు గమనించినట్లైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాలలో పూర్తి సమయం కేటాయించటానికి తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలి.

పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలపై కోపగించుకోవడం, చిన్నచిన్న శిక్షలు విధించడం జరుగుతుంటుంది. ఒక విద్యార్థిపై చర్య తీసుకుంటే అంటే చిన్నశిక్ష విధిస్తే (తరగతి గదిలో నిల్చో పెట్టడం, బయట నిలబెట్టడం వంటివి) మిగిలిన పిల్లలు క్రమశిక్షణతో ఉంటారని చాలామంది ఉపాధ్యాయులు అను కుంటారు. కానీ ఇది సరైనది కాదు. ఒక విద్యార్థిని శిక్షిస్తే మిగిలిన పిల్లలు అల్లరి చేయరు అనుకోవటం పొరపాటే అవు తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇంకా ఎక్కువ మార్కులు లేదా గ్రేడ్ తెచ్చుకోవాలని విధించే శిక్షలు కూడా విద్యార్థులపై  ఎటువంటి మార్పు రాదని పరిశోధనల్లో తేలింది. అందువలన శిక్షలు విధించటం సరికాదు. విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఉండే అవకాశాలకు కూ డా ఈ చిన్నచిన్న శిక్షలు సహకరిస్తాయి. పరిశోధనల్లో తేలింది ఏంటంటే విద్యార్థులలో మార్పు కోసం లేదా అభివృద్ధి కోసం ఎటువంటి శిక్షలు విధించి నప్పటికీ వీరిలో ఎటువంటి మార్పు రాకపోగా, పాఠశాలకు రావటానికి ఉత్సాహం చూపిం చక పోవటం కూడా కారణమౌతుంది. కొంతమంది విద్యార్థులను మందలిస్తే, మిగిలిన వారు క్రమశిక్షణతో ఉంటారని అంటారు. కాని ఇది అపోహ మాత్ర మే. పరిశోధనల్లో తేలింది ఏమంటే తోటి పిల్లలపై ఇది ఎటు వంటి ప్రభావం చూపకపోగా, వారు కూడా ఫలితాలలో ఇంకా వెనుకబడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని, ఇంటి పని చేయలేదని, మరేదైనా కారణం తోటి విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ, ఉపాధ్యాయులు ఆశించినట్లుగా ఆ విద్యార్థులలో ఎటువంటి మార్పు రాకపోగా, వారి సామర్ధ్యాలు తగ్గి పాఠశాల పట్ల ఆసక్తి సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయని పరిశోధనల్లో తెలిసింది. కొంతమంది విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు ఒక సంవత్సరంలో తీసుకుని, మరుసటి సంవత్సరం లో చర్యలు తీసుకోకుండా ఉన్నట్లయితే వారిలో అభ్యసన స్థాయి క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంవత్సరంలో తగ్గినప్ప టికీ, క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఉన్న సంవత్సరంలో అభ్యాసన సామర్థ్యం తగ్గదని పరిశోధనల్లో తేలింది. ఉదాహరణకు ఒక విద్యార్ధిపై గత సంవత్సరం శిక్షించినప్పుడు అభ్యసన సామర్థ్యం తగ్గవచ్చు. కానీ ఈ ఏడు ఎటువంటి శిక్ష విధించనందున అభ్యసనలో తగ్గుదల అనేది ఉండదు.  క్రమశిక్షణను అలవరచటానికి శిక్షించవలసిన అవసరం లే దు. సరైన విద్యా బోధన వలన, మంచి నడవడిక, అలవాట్లపై తరగతులు నిర్వహించడం వలన విద్యార్థులలో మార్పును తీసుకురావచ్చును.
 గోమఠం నరసింహా చార్యులు
ప్రధానోపాధ్యాయుడు
9948204890

Tags
English Title
Parental role in quality education
Related News