ఆకట్టుకుంటున్న‘పేపర్‌బాయ్’ ఫస్ట్‌లుక్

Updated By ManamWed, 06/20/2018 - 12:25
paper boy
Paper boy

‘రచ్చ’, ‘ఏమైంది ఈ వేళ’, ‘గౌతమ్ నంద’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో వస్తున్న చిత్రం ‘పేపర్ బాయ్’. సంతోశ్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్  ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించాడు. దర్శకుడు సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా మంగళవారం విడుదలైన ఈ చిత్ర పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రానికి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Paper Boy first look 
Related News