పాక్‌కు చైనా ‘సీఎం-302’ మిసైల్స్

china
  • భారత ఉపఖండంలో మారనున్న బలాబలాలు

  • బ్రహ్మోస్ శక్తిసామర్థ్యాలున్న ‘సీఎం-302’

  • అత్యాధునిక రాడార్‌ను రూపొందించిన డ్రాగన్

  • మన దేశ పరిమాణం సైజులో నౌకా దళానికి.. 

న్యూఢిల్లీ: భారత ఉపఖండంలో సైనిక సామర్థ్యాలను తారుమారు చేయగల శక్తి ఉన్న అత్యంత శక్తివంతమైన యాంటీ షిప్ మిసైల్‌ను పాకిస్థాన్‌కు అందించాలని చైనా నిర్ణయించింది. దాదాపు మన దేశ నౌకదళానికి చెందిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణికి ఉన్న శక్తిసామర్థ్యాలు వీటికి  ఉండటం గమనార్హం. ‘సీఎం-302’ మిస్సైల్స్‌ను పాక్‌కు చైనా అందించనుంది. ఈ మిస్సైళ్లను చైనా తయారీ 054 ఫ్రిగేట్ యుద్ధ నౌకల్లో అమర్చనున్నారు. దాంతో సముద్ర జలాల్లో పాక్ మరింత బలోపేతం కానుందని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, అత్యంత శక్తిమంతమైన రాడార్‌ను చైనా అభివృద్ధి చేసింది. ఈ అత్యాధునిక కాంపాక్ట్ సైజ్ మారిటైమ్ రాడార్ భారత దేశం పరిమాణంలో ఉన్న ప్రదేశంపై నిలకడగా నిఘా పెట్టగలదు. నావికా దళం కోసం రూపొందించిన ఈ రాడార్ వ్యవస్థను దేశీయంగానే అభివృద్ధి చేశారు. చైనా సముద్రాలపై కచ్చితమైన నిఘా పర్యవేక్షణకు ఇది ఉపయోగపడుతుంది. శత్రు నౌకలు, విమానాలు, క్షిపణుల వల్ల కలగబోయే ప్రమాదాన్ని చాలా ముందుగానే పసిగట్టడానికి ఈ రాడార్ వ్యవస్థ దోహదపడుతుంది. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం కన్నా చాలా శక్తిమంతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు. చైనా నిర్వహిస్తున్న ఓవర్ ద హోరైజన్ (ఓటీహెచ్) రాడార్ ప్రోగ్రామ్‌తో అనుబంధం ఉన్న శాస్త్రవేత్తను ఉటంకిస్తూ హాంగ్‌కాంగ్‌కు చెందిన సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్ ఈ వివరాలను వెల్లడించింది.

సంబంధిత వార్తలు