బరితెగించిన పాక్.. నలుగరు జవాన్ల మృతి

Updated By ManamWed, 06/13/2018 - 12:13
Pak Violates Ceasefire Pact kills 4 Indian Jawans
  • కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు.. భారత జవాన్లపైకి కాల్పులు

Pak Violates Ceasefire Pact kills 4 Indian Jawansజమ్మూ: పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. సరిహద్దులు దాటి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. భారత ఆర్మీ అధికారులపై కాల్పులకు తెగబడింది. జమ్మూకశ్మీర్ సాంబా జిల్లాలో గల రాంగఢ్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సోమవారం రాత్రి పాక్ జరిపిన కాల్పుల్లో నలుగురు భారత సైనికులు అమరులయ్యారు. అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంకు అధికారి సహా నలుగురు జవాన్లు చనిపోయినట్టు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఐజీ రామ్ అవతార్ తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణకు ఇప్పటికే పాక్‌తో భారత్ ఒప్పందం చేసుకుందని, ఆ ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు పొడిచి కాల్పులు జరిపిందని చెప్పారు. కాగా, మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్టు జమ్మూకశ్మీర్ డీజీపీ శేష్ పాల్ వైద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరోవైపు రాత్రి 10.30 గంటలకు పాక్ కాల్పులు ప్రారంభించిందని, జవాన్లు ఆ కాల్పులకు దీటైన సమాధానమిచ్చారని, తెల్లవారుజామున 4.30 గంటల దాకా కాల్పులు కొనసాగాయని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ నెలలో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఇది రెండోసారి. జూన్ 3న ప్రాగ్వాల్, కానాచాక్, ఖౌర్ సెక్టార్లలో పాక్ జరిపిన కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ ఏఎస్సై సహా ఇద్దరు జవాన్లు మరణించారు. మరో 10 మంది దాకా (ఎక్కువగా పౌరులే) గాయపడ్డారు. 

English Title
Pak Violates Ceasefire Pact kills 4 Indian Jawans
Related News