మన జనకళ తోలుబొమ్మలాట

Updated By ManamThu, 05/17/2018 - 22:56
image

imageకళకు పుట్టినిల్లు భారతదేశం. కళ అనగానే వేషాలు, పద్యాలు అనుకుంటారు ఈ తరం వారు. కళ అంటే నాట్యం, నృత్యం, గానం, నవరసాలు పండించడమే కాదు. భారతదేశ చరిత్రని, దాని ఔన్నత్యాన్ని, మనిషి విలువలను, వినోదంతో పాటు మంచి- చెడులను కూడా తెలియజేసేది కళ. అదే కాకుండా  భారతదేశ  సాంసృ్కతిక సంప్రదాయానికి అద్దం పట్టేదే కళ.  కళలో హరికథ, బుర్రకథ, వీధి నాటకాలు వంటి వి ఉన్నాయని అప్పుడప్పుడు వింటూంటాం. కాని వీటన్నిటికంటే కూడా అతి ప్రాచీనైమెన కళ తోలుబొమ్మలాట. ఇది ఒక సామూహిక సంగీత ప్రదర్శన కళారూపైవెునది. చారిత్రక పరిణామాలు గమనిస్తే ఒకప్పుడు విలక్షణైవెున ఉన్నతిని అనుభవించి ఈ కళ మొత్తం భారతీయ జానపద కళారూపాల్లోనే విశిష్ట స్థా నాన్ని పొందిందని చెప్పుకోవచ్చు. 

నృత్య దశలో నుండి మానవుడు నాటక దశలోనికి ఎదిగే పరిణామ క్రమంలో తోలుబొమ్మలాట ప్రముఖ పాత్ర వహించింది. జానపద మొదటి రంగస్థల ప్రదర్శన కళగా ఈ కళారూపాన్ని గుర్తించవచ్చు. దీని పుట్టుకపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం రాజస్థానాలలోని పండితులు తమ  ప్రభువులను సంతోష పెట్టడానికి బొమ్మలను తయారుచేసి, తెల్లటి బట్టను తెరగా అమర్చి, దానిపైన కాంతిలో బొమ్మల నీడలను పడేట్లు చేసి బొమ్మలాటను ప్రదర్శించేవారు. ఈ విధంగా తోలుబొమ్మలాట పుట్టిందని ప్రతీక. 
ఆంధ్రరాష్ట్రంలో ప్రాచీన ఓడరేవులైన మచిలీపట్నం, కళింగపట్నం నుంచి విదేశాలకు భారతీయులతో పాటు వెళ్లాయి. పాశ్చాత్యimage దేశాలలో జరిగే ఉత్సవాలలో ప్రదర్శించడాన్ని బట్టి చూస్తె మన దేశంలో కంటే ఈ కళకు ఇతర దేశాలల్లో బహుళ ఆదరణ లభించిందని తెలుస్తుంది. పర్షియా, టర్కీల మీదుగా గ్రీసు దేశాల్లో ప్రవేశించిన తోలుబొమ్మలు, గ్రీసులో నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికాలోని ముస్లిం దేశాలకు, 17 శతాబ్దంలో ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలకు వ్యాపించాయి. కాలానుగుణంగా ఆయాదేశాల్లో భిన్న రూపాలు ధరించినప్పటికీ భారతదేశం వీటికి మాతృక అని చెప్పవచ్చు. భారతదేశంలో యే ప్రాంతానికి చెందిన కళ అని తెలియదు కాని తెలుగువారిలోను, కర్ణాటకులలోను ఇది చాలా యేళ్ల నుంచి ఉన్న ఆట.  సుసంపన్నైమెన హిందూ ఇతిహాసాలను తెరమీదకి తెచ్చిన ఒక గొప్ప ప్రక్రియ తోలుబొమ్మలాట. వీటి తయారీకి జింక,లేడి లేదా దుప్పి, మేక వంటి జంతువుల తోళ్లను వాడుతారు. చైనాలో గాడిద, గ్రీసుదేశంలో ఒంటే చర్మంతోను తయారుచేస్తారు.  తోలుబొమ్మలాట  అంటే చాలు ఆ కాలం వారికి కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలిగాడు వంటి హాస్యపాత్రలు గుర్తొస్తాయి అని చెప్తుంటారు.   తోలుబొమ్మల కళారూపం అంతరించి పోవడానికి గల కారణం పరిశీలిస్తే 19, 20 శతాబ్దాలలో నాటకల ప్రభావం ఉధృతంగా ఉండడం, పద్యనాటకాల ప్రాధాన్యత పెరగడం, నాటకాలలో శాస్త్రీయతకు, సాంకేతిక పరిఙ్ఞానానికి ఉన్నతస్థానం లభించడం, విస్తృతంగా ఛానల్స్ వచ్చి ప్రపంచ తీరు తెన్నులను మార్చడం వంటి ఎన్నో కారణాలు తోలుబొమ్మలు వంటి కళారూపాల మనుగడకు సవాలుగా నిలిచాయి. 

ఆచార్య ఎమ్.వి.రమణమూర్తి, నిమ్మల గోవిందు, కుమార రాజారావు, అనపర్తి చిన్న కృష్ణ, తోట రంగారావు, తోట  పవన్ కుమార్, తోట  సింహాచలం వంటి ఎందరో కళాకారులు ఇప్పటికీ ఈ ప్రాచీన కళనే ఆస్తిగా భావిస్తూ అంతరించిపోకుండా కళకు ప్రాణం పోస్తున్నారు. 

English Title
Our popular puppets
Related News