ఓయూలో రాహుల్ సభకు అనుమతి నిరాకరణ

Updated By ManamFri, 08/10/2018 - 15:21
Rahul gandhi
Rahul Gandhi

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభకు ఓయూ వైస్ ఛాన్సులర్ అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాలరీత్యా రాహుల్ సభకు  అనుమతి నిరాకరించడంతో ఓయూ విద్యార్థి సంఘాల నేతలు హైకోర్టును ఆశ్రయించనున్నారు. కాగా రాహుల్ గాంధీ ఈ నెల  13,14 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉస్మానియాలో సదస్సులో రాహుల్ పాల్గొనేలా తెలంగాణ కాంగ్రెస్ నేతలు యోచించారు. అయితే రాహుల్ సభకు అనుమతి ఇచ్చేది లేదని ఓయూ వీసీ స్పష్టం చేశారు. 

కాగా రాహుల్ పర్యటనపై టీఆర్‌ఎస్ దొంగనాటకాలు ఆడుతోందని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఉస్మానియాలో ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కుంటిసాకులు చెబుతుందన్నారు. ఓయూలో సభకు అనుమతి ఇచ్చే విషయంలో పోలీస్ కమిషనర్ రేపు మాపు అంటూ నిర్ణయం చెప్పడం లేదని ఉత్తమ్ మండిపడ్డారు

English Title
OU VC Denies Permission For Rahul Gandhi Public Meeting
Related News