పవన్ కంటికి ఆపరేషన్ సక్సెస్

Updated By ManamFri, 07/13/2018 - 09:03
pawan

pawan  హైదరాబాద్: గత కొంత కాలంగా కంటి కురుపుతో బాధపడుతున్న నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బుధవారం జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైంది. హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్‌ ఆసుపత్రిలో చిన్న శస్త్రచికిత్స ద్వారా పవన్ కంటికి ఉన్న కురుపును వైద్యులు తొలగించారు. గురువారం సాయంత్రం పవన్‌ను డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు వైద్యులు సూచించినట్లు సమాచారం.

అయితే కొద్దిరోజుల కిందట పవన్ ఎడమ కంటిపై కురుపు ఏర్పడింది. అయినప్పటికీ నల్లని అద్దాలు వాడుతూ ప్రజా పోరాటయాత్రలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈనెల 16 నుంచి తూర్పుగోదావరి ప్రజాపోరాట యాత్రలో పవన్‌ పాల్గొనాల్సి ఉంది. ఆ పోరాటంలో పవన్ పాల్గొంటాడని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

English Title
Operation success to Pawan Kalyan
Related News