ఎలా ఎదుర్కొవాలో మాకు మాత్రమే తెలుసు

Updated By ManamFri, 08/10/2018 - 00:19
Sakshi Malik
  • భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్

Sakshiన్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో పతకం సాధించకుండా వస్తే ప్రజలను ఏ విధంగా ఎదుర్కొవాలో మాకు తెలుసు అని భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన కామన్‌వెల్త్ గేవ్‌‌సులో కాంస్య పతకం సాధించిన సాక్షి, ఇస్తాంబుల్‌లో ఇటీవలె జరిగిన యాసర్‌డొగు అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని సాధించలేకపోయింది. ‘ ప్రతిసారీ పతకం సాధించాలనే పోటీపడతాం. మాకు మాత్రమే తెలుసు పతకం సాధించకుంటే ప్రజలను ఎలా ఎదుర్కుంటున్నామో. వారు అడిగే ప్రశ్నలకు మా దగ్గర సమాధానాలు ఉండవు’ అని సాక్షి పేర్కొంది. ‘ రియో తర్వాత చాలా చాంపియన్‌షిప్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసా. అథ్లెట్ జీవితంలో కూడా గెలుపోటములు అనేవి ఉంటాయి. అయినా సరే మేము దేశం కోసం 100 శాతం కష్టపడతాం’ అని మాలిక్ వివరించింది. 

ఇండోనేషియాలో  ఈ నెల 18 నుంచి జరగబోయే ఆసియా గేవ్‌‌సులో సాక్షి 62 కిలోల విభాగంలో పోటీపడనుంది. ‘ ఆసియా గేమ్స్‌గా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అయ్యా. ధ్యానం ద్వారా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నాను. కొన్నిసార్లు ధ్యానం చేస్తు నా ఆటతీరుపై విశ్లేషణ చేసుకుంటున్నా. నిద్ర పోయే ముందు ఎందుకు ఓడిపోయానో ఆలోచిస్తా’ అని సాక్షి మాలిక్ చెప్పింది. ‘ కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించాలని టార్గెట్ పెట్టుకున్నా. కానీ కాంస్య పతకమే వచ్చింది. కానీ ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం గురించి ఆలోచించటంలేదు. శిక్షణలో ఏమి నేర్చుకున్నానో అదే అక్కడ చేస్తాను. ఆసియా గేమ్స్‌లో బంగారు పతకం కోసం 100 శాతం కష్టపడతా. ప్రజలు నా మీద చాలా అంచనాలు పెంచుకున్నారు. రియో ఒలింపిక్స్‌లో నా ఆటతీరు తర్వాత చాలా మంది అమ్మాయిలు తమ కెరీర్‌గా రెజ్లింగ్‌ని ఎంచుకోవటం నాకు సంతోషనిచ్చింది’ అని సాక్షి మాలిక్ ముగించింది. 

English Title
Only we know how to confront
Related News