సప్లిమెంటరీలో ఒకే ఒక్కడు!

Updated By ManamWed, 06/13/2018 - 23:55
student
  • టెన్త్ సోషల్ పరీక్షలో ఒక విద్యార్థికి 12 మంది అధికారుల పర్యవేక్షణ

studentపత్తికొండ: ఒకరు పరీక్ష హాలులో ఇన్విజలేటర్.. ప్రశ్న పత్రాల పర్యవేక్షణకు ఓ అధికారి.. వాటిని పరీక్ష గది వరకు తెచ్చేందుకు ఓ అటెండర్.. పరీక్ష హాలు వద్ద రక్షణగా పోలీసులు.. మాస్‌కాపీయింగ్ జరగకుండా స్క్వాడ్‌లు.. సెంటర్ సూపరింటెండెంట్.. డిపార్ట్‌మెంట్ ఆఫీసర్.. ఇలా 12 మంది అధికారుల పర్యవేక్షణలో జరిగిన పరీక్ష అది... ఇంత పకడ్బందీ ఏర్పాటు బాగానే ఉన్నా.. అక్కడ పరీక్ష రాసింది మాత్రం ఒకే ఒక్కడు! ఈ వింత పరిస్థితి కర్నూలు జిల్లా పత్తికొండలో చోటుచేసుకుంది. గత వారం నుంచి జరుగుతున్న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా బుధవారం సోషల్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే పత్తికొండ పరీక్ష కేంద్రంలో దామోదర్ అనే ఒకే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు. దీంతో ఆ పరీక్షకు మొత్తం 12 మంది తప్పక విధులు నిర్వహించాల్సి వచ్చింది.

Tags
English Title
Only one supplementary!
Related News